Oscar wins: ‘ఆస్కార్’ ను కూడా మీ ఖాతాలో వేసుకోకండి; బీజేపీపై కాంగ్రెస్ విసుర్లు-rajya sabha praises creators of naatu naatu the elephant whisperers on their oscar wins ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rajya Sabha Praises Creators Of 'Naatu Naatu', 'The Elephant Whisperers' On Their Oscar Wins

Oscar wins: ‘ఆస్కార్’ ను కూడా మీ ఖాతాలో వేసుకోకండి; బీజేపీపై కాంగ్రెస్ విసుర్లు

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 06:22 PM IST

Rajya Sabha praises Oscar wins: ప్రతిష్టాత్మక ఆస్కార్ (Oscar) గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ (RRR) పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజ్యసభలో మంగళవారం పలువురు సభ్యులు ఆస్కార్ గెల్చుకున్న ఆర్ఆర్ఆర్ (RRR), ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers) లను ప్రశంసిస్తూ ప్రసంగాలు చేశారు.

నాటు నాటు పాట దృశ్యం
నాటు నాటు పాట దృశ్యం (HT_PRINT)

Rajya Sabha praises Oscar wins: ఆస్కార్ (Oscar) గెల్చుకున్న ఆర్ఆర్ఆర్ (RRR), ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers) లను పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. రాజ్యసభలో ఆస్కార్ (Oscar) ను సాధించిన ఈ రెండు సినిమాలను ప్రశంసిస్తూ పలువురు సభ్యలు ప్రసంగాలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Rajya Sabha praises Oscar wins: దేశానికి గర్వకారణం

Rajya Sabha praises Oscar wins: రాజ్యసభ మంగళవారం ప్రారంభం కాగానే, చైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ (Oscar) అవార్డ్ గెల్చుకున్న ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని నాటు నాటు (Naatu Naatu పాటను, బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో ఆస్కార్ (Oscar) అవార్డ్ గెల్చుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers) ను ప్రస్తావిస్తూ, ఈ రెండు సినిమాలు భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయన్నారు. 95వ ఎకాడమీ అవార్డ్స్ భారత్ కు గర్వకారణంగా నిలిచాయన్నారు. ఈ రెండు సినిమాల మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

Rajya Sabha praises Oscar wins: మహిళల సినిమా

అనంతరం, కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ మాట్లాడుతూ, ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers) డాక్యుమెంటరీని ఇద్దరు మహిళలు తీశారని, భారతీయ మహిళల టాలెంట్ ను ఈ డాక్యుమెంటరీ ప్రపంచానికి చూపిందని ప్రశంసించారు. భారతీయ మహిళల గౌరవాన్ని వారు మరింత పెంచారన్నారు. తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ (RRR) స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన విజయేంద్ర ప్రసాద్ రాజ్య సభ సభ్యుడేనన్న విషయాన్ని గుర్తు చేశారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మాట్లాడుతూ, భారతదేశ అత్యంత ముఖ్యమైన రాయబారులైన సినిమా వ్యక్తుల గురించి సభలో చర్చ జరగడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో ఆస్కార్ (Oscar) గెలుచుకున్న ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే ను ఆమె గౌరవపూర్వకంగా గుర్తు చేసుకున్నారు.

Rajya Sabha praises Oscar wins: ఇది కూడా మీ ఖాతాలో వేసుకుంటారా? ఏంటి?

అనంతరం రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన రెండు సినిమాలు ఆస్కార్ (Oscar) గెలుచుకుని భారతదేశానికి గర్వకారణంగా నిలిచాయన్నారు. ఈ ఆస్కార్ గెలుపులను కూడా బీజేపీ తమ ఖాతాలో వేసుకోకూడదని ఖర్గే చమత్కరించారు. ‘‘ఆర్ఆర్ఆర్ (RRR) కు, ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers) కు ఆస్కార్ (Oscar) రావడానికి తాము, తమ నాయకుడు మోదీ కారణమని మాత్రం అనకండి. మేమే డైరెక్ట్ చేశాం. మేమే పాట రాశాం అనో.. లేకపోతే, మోదీజీ డైరెక్ట్ చేశారు.. మోదీజీ పాట రాశారు అనో చెప్పి క్రెడిట్ తీసుకోవద్దని కోరుతున్నా’’ అని బీజేపీపై సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ మాట్లాడుతూ, ఖర్గే సరదాగా చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డులను తొలగించాలని చూడకండి అని వ్యాఖ్యానించారు. ‘ఇది అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం’ అని జైరామ్ రమేశ్ అన్నారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers) డాక్యుమెంటరీని సభ్యులు కోసం ప్రదర్శించాలని, అలాగే, అన్ని పాఠశాలల్లో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలని సూచించారు.

WhatsApp channel