రాజ్యసభలో 47గంటల సమయం వృథా.. లోక్​సభ పనిచేసింది 44 గంటలే!-rajya sabha lost 47 hours in the monsoon session due to interruptions ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rajya Sabha Lost 47 Hours In The Monsoon Session Due To Interruptions

రాజ్యసభలో 47గంటల సమయం వృథా.. లోక్​సభ పనిచేసింది 44 గంటలే!

Sharath Chitturi HT Telugu
Aug 09, 2022 05:59 AM IST

Parliament monsoon session : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల కార్యకలాపాలు సోమవారంతో ముగిశాయి. కాగా.. రాజ్యసభలో మొత్తం మీద 47గంటల సమయం వృథా అయ్యింది.

రాజ్యసభలో 47గంటల సమయం వృథా.. లోక్​సభ పనిచేసింది 44 గంటలే!
రాజ్యసభలో 47గంటల సమయం వృథా.. లోక్​సభ పనిచేసింది 44 గంటలే! (HT)

Parliament monsoon session : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో ఎంతో విలువైన సమయం వృథా అయ్యింది! ముఖ్యంగా రాజ్యసభ కేవలం 35 గంటలే పనిచేసింది. మొత్తం మీద రాజ్యసభలో 47గంటల సమయం వృథా అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

జులై 18న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారంతో రాజ్యసభ కార్యకలాపాలు ముగిశాయి. విపక్షాల నిరసనల కారణంగా.. 16 సిట్టింగ్​లలో 47 గంటల సమయం వృథాగా మారింది.

ఈ వ్యవహారంపై రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలకు ఆటంకం కలగడం బాధాకరమైన విషయమన్నారు.

రాజ్యసభ ఛైర్మన్​, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. రాజ్యసభ ఛైర్మన్​గా ఆయనకు సోమవారమే చివరి రోజు. చివరి ప్రసంగంలో.. సభ కార్యకలాపాలకు కలిగిన ఆటంకాలను ప్రస్తావించారు వెంకయ్య నాయుడు. ప్రశ్నలు అడగడం, సమాధానాలు పొందడం వంటి అవకాశాలు కోల్పోయామని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ దఫా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో.. రాజ్యసభలో 235 ప్రశ్నలు లిస్టింగ్​కు రాగా.. కేవలం 61 వాటికి మాత్రమే సమాధానాలు లభించాయి. ఏడు రోజుల పాటు క్వశ్చన్​ హవర్​ కార్యక్రమమే జరగలేదు. 60 స్పెషల్​​ మెన్షన్లు, 25 అంశాలు మాత్రమే చర్చకు వచ్చాయి.

Rajya Sabha : ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై తీవ్రస్థాయిలో నిరసనలు చేసిన విపక్షాలు.. సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. కాగా.. ధరల పెరుగుదలపై రాజ్యసభలో చర్చ జరగ్గా.. కేవలం 33మంది మాత్రమే పాల్గొన్నారు. ఆ చర్చ కూడా నాలుగు గంటలే జరిగింది.

ఈ దఫా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో నాలుగు బిల్లులు పాస్​ అయ్యాయి.

ఇక చివరి ప్రసంగంలో ప్రధాని మోదీతో పాటు అధికార, విపక్ష ఎంపీలకు వెంకయ్య నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

లోక్​సభలో..

Lok లోక్​సభ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. 16 సిట్టింగ్​లలో 44 గంటల 29 నిమిషాలు పనిచేసింది.

ఈ సమయంలో ఏడు బిల్లులు, ఆరు లెజిస్లేషన్లు పాస్​ అయ్యాయి.

రెండు సభలు.. షెడ్యూల్​కు నాలుగు రోజుల ముందే ముగిశాయి.

WhatsApp channel

సంబంధిత కథనం