Rajnath Singh's ‘Shastra Puja’: దసరా సందర్భంగా శస్త్ర పూజ చేసిన రక్షణ మంత్రి
Rajnath Singh's ‘Shastra Puja’: దసరా సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ఉత్తరాఖండ్ లోని మిలటరీ బేస్ లో సాంప్రదాయ బద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు.
Rajnath Singh's ‘Shastra Puja’: ప్రతీ దసరాకు రక్షణ మంత్రి ఏదో ఒక సైనిక కేంద్రంలో ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ బుధవారం విజయ దశమి సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ లోని ఔలి మిలటరీ బేస్ లోని ఆయుధ శ్రేణికి శస్త్ర పూజ నిర్వహించారు.
Rajnath Singh's ‘Shastra Puja’: సైనికులకు ప్రశంసలు..
ఈ సందర్భంగా అక్కడి సైనికులతో రాజనాథ్ సింగ్ కాసేపు మాట్లాడారు. భారతీయ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. ముఖ్యంగా 2020లో తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ముఖాముఖి పోరాటంలో భారతీయ సైనికులు గొప్ప ధైర్య సాహసాలను ప్రదర్శించారని గుర్తు చేశారు.
Rajnath Singh's ‘Shastra Puja’: వసుధైక కుటుంబం..
వసుధైక కుటుంబం భావనను భారత్ విశ్వసిస్తుందని, అదే సమయంలో భారత్ పై దాడి చేయాలని ప్రయత్నిస్తే సరైన బుద్ధి చెప్తామని రాజ్ నాథ్ వివరించారు. ఈ కార్యక్రమంలో సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే, సూర్య కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ యోగేంద్ర దిమిరి కూడా పాల్గొన్నారు.