Woman marries God Vishnu:శ్రీ మహా విష్ణువును వివాహమాడిన యువతి; కారణమేంటో తెలుసా?
Woman marries God Vishnu: రాజస్తాన్ లోని ఒక యువతి శ్రీ మహా విష్ణువును వివాహం చేసుకుంది. బంధుమిత్రలు సమక్షంలో, పూర్తి సంప్రదాయ బద్ధంగా ఈ వివాహం జరిగింది.
Woman marries God Vishnu: రాజస్తాన్ లో పూజా సింగ్ అనే 26 ఏళ్ల యువతి శ్రీ మహా విష్ణువు ను పెళ్లి చేసుకుంది. శ్రీ మహా విష్ణువుతో ఆమె వివాహం సంప్రదాయ బద్ధంగా, బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. అయితే, దేవుడిని పెళ్లి చేసుకోవడానికి ఆమె చెప్పిన కారణం మాత్రం విస్మయపరిచేలా ఉంది.
Woman marries God Vishnu: పెళ్లయ్యాక బాధలు పడలేక..
అందరిలా పెళ్లి చేసుకుని, ఆ తరువాత బాధలు పడుతూ జీవించలేనని, అలా జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇష్టం లేకపోవడం వల్ల ఇలా శ్రీ మహా విష్ణువు(ఠాకూర్జీ)ని వివాహం చేసుకున్నానని ఆమె వివరిస్తున్నారు. ‘‘చాలా జంటల మధ్య పెళ్లి తరువాత గొడవలు, వేధింపులు చాలా చూస్తున్నాను. పెళ్లి వల్ల ఎక్కువగా బాధ పడుతోంది మహిళలే. అలాంటి నరకప్రాయం వంటి జీవితం నాకు వద్దు అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని పూజా సింగ్ వివరించారు.
Woman marries God Vishnu: తండ్రికి ఇష్టం లేదు..
తను ఈ నిర్ణయం తీసుకున్న తరువాత తన కుటుంబాన్ని ఒప్పించడం చాలా కష్టమైందని ఆమె వివరించారు. తన తండ్రికి ఈ వివాహం అస్సలు ఇష్టం లేదని, ఆయన ఈ పెళ్లికి హాజరు కాలేదని తెలిపారు. అయితే, తన తల్లి తనకు అండగా నిలిచిందని, కన్యాదానం కూడా తానే చేసిందని తెలిపింది. పూజా సింగ్ తండ్రి రిటైర్డ్ బీఎస్ఎఫ్ అధికారి. పూజా సింగ్ పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.
Woman marries God Vishnu: సంప్రదాయ బద్ధంగా..
సాధారణ వివాహం మాదిరిగానే, పూర్తిగా హిందూ సంప్రదాయ బద్ధంగా ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నానని పూజ వివరించారు. అందుకే బంధుమిత్రలను ఆహ్వానించి, వారి సమక్షంలో అన్ని వివాహ క్రతువులు పూర్తి చేసి, ఈ పెళ్లి చేసుకున్నానన్నారు. ప్రస్తుతం తమ ఇంట్లోని పూజ గదిలో తాను వివాహం చేసుకున్న ఠాకూర్జీ విగ్రహాన్ని పెట్టానన్నారు.