Caste census : రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బిహార్ తరహా కుల గణన!
Caste census : దేశవ్యాప్తంగా.. కుల గణనపై చర్చ పెరుగుతోంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోనూ బిహార్ తరహా కుల గణన ప్రక్రియ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
Caste census : బిహార్‌లో కుల గణన హిట్ అయ్యింది! ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోను కుల గణనను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు వ్యాఖ్యానించారు.

రాజస్థాన్‌లో..
కుల గణనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ సీఎం గహ్లోత్.
"రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో కుల గణనను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. రాజస్థాన్‌లో కూడా దీనిని మేము అమలు చేస్తాము. బిహార్ తరహాలోనే కుల గణన ప్రక్రియ చేపడతాము. జనాభా తగ్గట్టు ప్రజలకు సౌకర్యాలు అందాలి. బిహార్ తరహా కుల గణన చేపట్టాలని అధికారులకు ఆదేశాలిస్తాము," అని గహ్లోత్ తెలిపారు.
Caste census in Rajasthan : "అందరికి సామాజిక భద్రత కావాలంటే.. కుల గణన చేపట్టడం చాలా ముఖ్యం. దేశంలో అనే కులాలు ఉన్నాయి. కులాల్లో ఎంత జనాభా ఉంది? అన్నది తెలుసుకుంటేనే ప్రత్యేక పథకాలు విడుదల చేయవచ్చు," అని అశోక్ గహ్లోత్ స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో..
ఛత్తీస్‌గఢ్‌లోనూ కుల గణన ప్రక్రయ చేపట్టే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ప్రియాంక గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు.
"ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వంలోకి వస్తే.. బిహార్ తరహా కుల గణనను చేపడతాము. ఛత్తీస్‌గఢ్‌తో నా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. సమయంతోనే నమ్మకం పెరుగుతుంది. మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. కుల గణన చేపడతాము," అని ప్రియాంక గాంధీ అన్నారు.
Caste census in Chhattisgarh : ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై ఈ కుల గణన అస్త్రానికి పదును పెడుతోంది విపక్ష ఇండియా బృందం.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఇంకో అడుగు ముందుకేసి, ఇండియా బృందం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. దేశవ్యాప్తంగా కుల గణన ప్రక్రియ చేపడతామని హామీనిచ్చారు.
బిహార్‌లో పరిస్థితి ఇలా..
Bihar caste census : బిహార్‌లో కుల గణన డేటాను ఇటీవలే ప్రకటించింది నితీశ్ కుమార్ ప్రభుత్వం. రాష్ట్ర జనాభాలో 63శాతం మంది ఓబీసీలు- ఈబీసీలే ఉన్నారని సర్వేలో తేలింది. బిహార్ జనాభా సుమారు 13.07 కోట్లు! ఈ జనాభాలో ఈబీసీ (అత్యంత వెనకబడిన వర్గాలు) వాటా 36శాతం. ఓబీసీల వాటా 27.13శాతం. 19.7శాతం మంది ఎస్సీలు 1.7శాతం మంది ఎస్టీలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం