అబ్బా ఏం తెలివి బ్రో నీది.. ఎలక్ట్రిక్ కారును ఇలా కూడా వాడొచ్చా? ఈవీ బ్యాటరీతో కచోరీలు
EV Battery For Cooking : కొందరు చేసే పనులు చూస్తుంటే.. కొన్నిసార్లు నవ్వు వస్తుంది.. ఇలా కూడా ఆలోచించొచ్చా అనిపిస్తుంది. అలాంటి పనే ఓ వ్యక్తి చేశాడు. ఎలక్ట్రిక్ కారు బ్యాటరీతో కచోరీలు చేసుకున్నాడు.
India Is Not For Beginners అని సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని పనులు చూసి ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి. చాలా మంది చేసే వెరైటీ పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇలా కూడా చేయెుచ్చా అనేలా ఉంటాయి. అలానే ఓ వ్యక్తి కూడా ఈవీ బ్యాటరీ తీసి వంట చేసుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి తన ఎలక్ట్రిక్ వాహనాన్ని(EV) కచోరీలను చేయడానికి ఉపయోగించాడు. ఆ వ్యక్తి ఈవీ బ్యాటరీని ఇండక్షన్ కుక్కర్‌కి కనెక్ట్ చేశాడు. దానికి ఎంత పవర్ కావాలో ఉపయోగించుకున్నాడు. కారు ముందు కుర్చీలో కూర్చుని గిన్నెలో నూనె పోశాడు. నూనె వేడి అయ్యాక అందులో కచోరీలు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈవీ కారును ఎలా వాడాలో ఈ బ్రో కనుగొన్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అతడి క్రియేటివిటీని ప్రశంసిస్తున్నారు. మరికొందరు వంట కోసం అధిక సామర్థ్యం గల బ్యాటరీలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించారు.
ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఇతర పరికరాలను ఉపయోగించనప్పుడు ఈ పద్ధతి పనికొస్తుందని కొందరు వ్యాఖ్యానించారు. భారతీయులు ఎలాంటి పనైనా చేయగలుగుతారని చెప్పేందుకు ఈ వీడియో ఎగ్జాంపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇదొక వినూత్న ఆలోచన. దేనినైనా ఎందుకు వృథా చేయాలి.' అని ఒక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. రాజస్థానీయులకు కచోరీ పట్ల అభిరుచి ఈ వీడియో చెబుతుందని మరొకరు వ్యాఖ్యానించారు.
మరికొందరు పిక్నిక్ స్పాట్ నుండి తిరిగి వస్తున్నప్పుడు డ్రైవర్‌కు బ్యాటరీ తక్కువ అవుతుందని కామెంట్ చేశారు. తరువాతి ఛార్జింగ్ స్టేషన్‌కు చేరుకోవడానికి బ్యాటరీ చాలా అవసరం, ఆ బ్యాటరీని కొన్ని కచోరీలు వేయించడానికి ఉపయోగించాడు. కానీ మిగిలిపోయిన నూనె పరిస్థితి ఏంటని ఓ వ్యక్తి ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
అయితే ఇటీవల ఇలాంటి వీడియోలు కొన్ని బాగానే వైరల్ అయ్యాయి. అంతకుముందు ఓ వ్యక్తి ఈవీ బ్యాటరీతో కాఫీ పెట్టుకున్నాడు. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఈవీ బ్యాటరీ సామర్థ్యం అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరగవచ్చు. కాసేపు సరదాగా చేసే పని ప్రాణాల మీదకు రావొచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది.