Lightning kills 4 in Rajasthan: మెరుపులు, పిడుగులతో వర్ష బీభత్సం
Lightning kills 4 in Rajasthan: రాజస్తాన్ లో పిడుగుపాటుకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
Lightning kills 4 in Rajasthan: రాజస్తాన్ లో ఎడతెరిపి లేని వర్షాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాల ముప్పు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

Lightning kills 4 in Rajasthan: పిడుగుపాటు..
రాజస్తాన్ లోని పాలి, చిత్తోడ్ గఢ్ జిల్లాల్లో పిడుగులు పడిన రెండు వేర్వేరు ఘటనలకు నలుగురు మృతి చెందారు. పాలి జిల్లాలోని చొటీలా గ్రామంలో పొలం పని చేసుకుంటున్న రూపీ, రుక్మ, ప్రేమ్ దేవీలు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని జోధ్ పూర్ ఆసుపత్రికి తరలించారు. చిత్తోర్ గఢ్ జిల్లాలో పిడుగు పడి సుందర్ లాల్ కంజర్ చనిపోయాడు. ఇంట్లోని బాల్కనీలో కూర్చుని ఉండగా, పిడుగు పడి ఆయన ప్రాణాలు కోల్పోయారు.
Lightning kills 4 in Rajasthan: మరి కొన్ని రోజులు ముప్పు తప్పదు..
రాజస్తాన్ లో వర్ష బీభత్సం మరి కొన్ని రోజులు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు రాజస్తాన్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటివరకు కరౌలిలో అత్యధికంగా 118 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది.