Rajasthan: ‘పుల్వామా’ అమరుల భార్యల నిరసన; జైపూర్ లో తీవ్ర ఉద్రిక్తత
protest in Jaipur: ‘పుల్వామా’ దాడిలో (2019 Pulwama terror attack) మరణించిన జవాన్ల భార్యలు చేపట్టిన నిరసన రాజస్తాన్ లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పుల్వామా దాడి లో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు, బంధువులు, బీజేపీ కార్యకర్తలు వేలాదిగా జైపూర్ (Jaipur) ను ముట్టడించారు.
2019లో జరిగిన పుల్వామా దాడి (2019 Pulwama terror attack) ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ దాడిలో అమరులైన జవాన్లకు అందాల్సిన సాయంపై తాజాగా రాజస్తాన్ లో వివాదం రాజుకుంది.
protests in Jaipur: కుటుంబ సభ్యులకు ఉద్యోగం
పుల్వామా దాడి (Pulwama terror attack) లో అమరులైన జవాన్ల కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని రాజస్తాన్ ప్రభుత్వం నాడు హామీ ఇచ్చింది. అయితే, కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోతే, దగ్గరి బంధువుల్లో ఒకరికి ఆ అవకాశం కల్పించాలని కోరుతూ ముగ్గురు అమర జవాన్ల భార్యలు జైపూర్ (Jaipur) లో వారం క్రితం నిరసన ప్రారంభించారు. వారిని శుక్రవారం పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీజేపీ నిరసన ప్రారంభించింది.
protests in Jaipur: జైపూర్ లో ఉద్రిక్తత
పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు జైపూర్ (Jaipur) తరలివచ్చాయి. అలాగే, అమర జవాన్ల కుటుంబ సభ్యులు కూడా భారీగా వచ్చారు. నిరసన కేంద్రం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేశారు. పోలీసులతో బాహాబాహీకి దిగారు. దాంతో పోలీసులు లాఠీ చార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. బీజేపీ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ ఇంటి ముందు కూడా నిరసన ప్రదర్శన చేపట్టారు. దాంతో అక్కడ కూడా ఉద్రిక్తత నెలకొన్నది. జైపూర్ (Jaipur) నగర వ్యాప్తంగా పోలీసులను మోహరించారు. నిరసనలకు నాయకత్వం వహించిన బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో ఉప విపక్ష నేత రాజేంద్ర రాథోడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర రాథోడ్ మాట్లాడుతూ.. రాజస్తాన్ ప్రభుత్వం పుల్వామా (Pulwama terror attack) అమరుల భార్యలను అవమానిస్తోందన్నారు. పుల్వామా ఘటన జరిగి నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ నాటి హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అయితే, పుల్వామా అమరుల రక్త సంబంధీకులకు మాత్రమే ఉద్యోగం కల్పించడం సాధ్యమవుతుందని, ఇతర దగ్గరి బంధువులకు ఉద్యోగం ఇవ్వలేమని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) ఇప్పటికే స్పష్టం చేశారు.