Crime news: దళిత విద్యార్థి అనుమానాస్పద మృతి; కులం పేరుతో టీచర్ల వేధింపులు; హత్యేనంటున్న తల్లిదండ్రులు
Crime news: 15 ఏళ్ల దళిత విద్యార్థి పాఠశాలలో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తమ కుమారుడిని ఉపాధ్యాయులే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
Crime news: 15 ఏళ్ల దళిత విద్యార్థి పాఠశాలలో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తమ కుమారుడిని ఉపాధ్యాయులే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ మే రకు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాజస్తాన్ లోని కొట్ పుత్లి జిల్లాలో చోటు చేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
కులం పేరుతో వేధింపులు..
రాజస్తాన్ లోని కొట్ పుత్లి జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం పాఠశాల పారిశుద్ధ్య సిబ్బంది తరగతి గదిలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న ఆ విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే, స్కూల్ హెడ్ మాస్టర్ కు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, తమ కుమారుడిని ఆ స్కూల్ లోని ఇద్దరు టీచర్లు తరచూ వేధించేవారని, కులం పేరుతో దూషించేవారని, అవమానించేవారని ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడిని ఆ టీచర్లే హత్య చేసి, సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశామని, అయినా ఆయన పట్టించుకోలేదని, ‘మీ కులం వాళ్లు ఇక మారరా?’ అని తమపైననే ఆయన ఆగ్రహించాడని వెల్లడించారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీచర్ల సస్పెన్షన్
ఈ ఘటన అనంతరం ఆ ఇద్దరు టీచర్లను అధికారులు సస్పెండ్ చేశారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగానే భావిస్తున్నామని, అయినా, ఆ విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు టీచర్లపై ఐపీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తో అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. మరోవైపు స్థానిక దళిత సంఘాలు ఆ పాఠశాల ముందు, స్థానిక రహదారిపై ధర్నా నిర్వహించాయి. ఆ ఇద్దరు టీచర్లు ఆ విద్యార్థిని చాలా సార్లు కులం పేరుతో తిట్టేవారని, కొట్టేవారని ఆ విద్యార్థి క్లాస్ మేట్స్ కూడా చెప్పారు.
టాపిక్