crime news : ఆ పనికి ఒప్పుకోలేదని.. స్నేహితుడిని చంపేశారు!
Crime news : ఓరల్ సెక్స్‌కి అంగీకరించలేదన్న కోపంతో.. ఓ వ్యక్తిని, ఇద్దరు స్నేహితులు కిరాతకంగా పొడిచి చంపేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది.
Rajasthan murder case : రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓరల్ సెక్స్‌కి ఒప్పుకోలేదన్న కారణంతో.. ఓ వ్యక్తిని ఇద్దరు కిరాతకంగా చంపేశారు. నిందితులు, బాధితుడు.. స్నేహితులు కావడం గమనార్హం!
ఇదీ జరిగింది..
రాజస్థాన్ బరణ్ జిల్లాల్లో నివాసముంటున్నారు ప్రజాపతి, యాదవ్, సురేంద్ర ఓం ప్రకాశ్ బైర్వా. ప్రజాపతికి రోడ్డు పక్కన ఓ డాబా ఉంది. యాదవ్.. ఓ రోజువారీ కూలీ.
కాగా.. దాదాపు 10 రోజుల క్రితం.. ప్రజాపతి, యాదవ్, భైర్వాలు కలిసి మద్యం సేవించారు. అనంతరం.. సమీప గ్రామంలోని ప్రజాపతి సోదరి ఇంటికి వెళ్లారు.
ఆ మహిళ ఇంటి నుంచి వెనక్కి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 32ఏళ్ల ప్రజాపతి, సురేంద్ర యాదవ్‌లు.. భైర్వాని ఆపి, తమతో ఓరల్ సెక్స్ చేయాలని అడిగారు. అందుకు.. భైర్వా ఒప్పుకోలేదు. మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరికి కోపం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే భైర్వాని దారుణంగా కొట్టారు. ఓరల్ సెక్స్‌కి ఎంతకీ అంగీకరించకపోవడంతో.. అతికిరాతకంగా పొడిచి, పొడిచి చంపేశారు. అనంతరం సమీపంలోని నీళ్లు లేని చెరువులో పడేసి వెళ్లిపోయారు.
Man killed in Rajasthan by friends : ఫిబ్రవరి 26న.. బరణ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో భైర్వా మృతదేహం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయటపడింది.
భైర్వా.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి బయటకి వెళ్లినట్టు పోలీసులు తెలుసుకున్నారు. అతని హత్యలో వారి హస్తం ఉందని అనుమానించారు. ఈ క్రమంలో.. వారిని ప్రశ్నించేందుకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న యాదవ్.. విషం తాగేశాడు! అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం.. అతను అక్కడ చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
మరోవైపు.. ప్రజాపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే.. పోలీసులకు.. భైర్వా హత్య వెనుక అసలు కారణం తెలిసింది! చేసిన తప్పును ప్రజాపతి ఒప్పుకున్నాడు.
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం..
Crime news latest : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఓ 7ఏళ్ల బాలిక మృతదేహం.. ఛత్తీస్‌గఢ్‌లో కలకలం సృష్టించింది. దుండగులు.. ఆమెను రాయితో కొట్టి చంపేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
తటవాహి అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. బాలిక మృతదేహం కనిపించిందని ఓ వ్యక్తి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు, ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. బాలికను ఎవరో రాయితో కొట్టి చంపేశారని, తలపై బలమైన గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. రేప్? జరిగిందా? అన్న ప్రశ్నకు.. శుక్రవారం నిర్వహించబోయే పోస్టుమార్టంతో స్పష్టత వస్తుందని పోలీసులు వెల్లడించారు.
మరోవైపు.. బాలిక హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరు హత్య చేసి ఉంటారు? అని ఆలోచిస్తుండగా.. ఎవరైతే ఆమె గురించి తొలుత చెప్పారో, ఆ వ్యక్తి శరీరంపై గాయాలు ఉండటాన్ని గుర్తించారు. అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అతను.. అదే ప్రాంతంలో 6-7 నెలలుగా నివాసముంటున్నాడని, అతని ఆఫీస్ కూడా ఘటనాస్థలానికి దగ్గర్లోనే ఉందని పోలీసులు వెల్లడించారు.
సంబంధిత కథనం