Bus accident : రైల్వే ట్రాక్ మీద పడిపోయిన బస్సు.. నలుగురు మృతి- 34మందికి గాయాలు!
Rajasthan bus accident : 70, 80మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు.. అనూహ్యంగా రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించారు.
Rajasthan bus accident : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దౌస కలెక్టరేట్ సర్కీల్కి సమీపంలో.. ఓ బస్సు, రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 34మంది గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. హరిద్వార్ నుంచి జైపూర్‌కు వెళుతున్న బస్సు.. అదుపు తప్పి 30 అడుగుల దిగువన రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70-80 మంది ఉన్నట్టు తెలుస్తోంది.
Rajasthan bus accident today : ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీశారు. నలుగురి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన 34మందిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని.. జైపూర్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు.
"9మందిని జైపూర్‌కి తీసుకెళ్లారు. నలుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలను.. దౌస జిల్లా ఆసుపత్రిలోని మార్చ్యురీలో పెట్టాము," అని పోలీసులు వెల్లడించారు.
Rajasthan bus accident latest new : ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. బస్సు వెళ్లి రైల్వే ట్రాక్‌పై పడటంతో రైల్వే సేవలకు సైతం తీవ్ర ఆటంకం ఎదురైంది.
"రైల్వే కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. కొన్ని రైళ్ల సేవలను గంటల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. జైపూర్- దిల్లీ రైలుని ఆపేశారు. ట్రాక్‌పై పడి ఉన్న బస్సును తొలగించేందుకు సమయం పట్టింది. ఆ తర్వాత కార్యకలాపాలను పునరుద్ధరించారు," అని పోలీసులు వెల్లడించారు.
Rajasthan bus accident death toll : మరోవైపు.. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాజస్థాన్ బస్సు ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
రక్తమోడుతున్న రహదారులు..
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రక్తమోడుతున్నాయి. 2022 రహదారి ప్రమాదాల లెక్కల ప్రకారం.. హెల్మెట్లు, సీటు బెల్టులు పెట్టుకోని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సగటున 21 మంది మరణించారు. మొత్తంగా 7,535 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,439 మంది గాయపడ్డారు.
2021, 2022లో ఏపీ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 40 శాతానికి పైగా 18-35 ఏళ్ల మధ్య వయస్కులే. రోడ్డు ప్రమాదాల బాధితుల్లో ఎక్కువగా యువకులు అతివేగంగా కారణంగా మృతి చెందారని రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం