Class 1 Admission: ఆరేళ్లు నిండితేనే పిల్లలకు 1వ తరగతి అడ్మిషన్: కేంద్రం సూచనలు: వివరాలివే-raise minimum age of admission for class 1 to 6 years central government to states uts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Raise Minimum Age Of Admission For Class 1 To 6 Years Central Government To States Uts

Class 1 Admission: ఆరేళ్లు నిండితేనే పిల్లలకు 1వ తరగతి అడ్మిషన్: కేంద్రం సూచనలు: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 23, 2023 01:31 PM IST

Class 1 Admission: ఆరు సంవత్సరాలు నిండిన పిల్లలకే 1వ తరగతిలో అడ్మిషన్లు కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది.

Class 1 Admission: ఆరేళ్లు నిండితేనే పిల్లలకు 1వ తరగతి అడ్మిషన్: కేంద్రం ఆదేశాలు
Class 1 Admission: ఆరేళ్లు నిండితేనే పిల్లలకు 1వ తరగతి అడ్మిషన్: కేంద్రం ఆదేశాలు

Class 1 Admission: పిల్లలకు 1వ తరగతి అడ్మిషన్ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఈ అంశంపై లేఖలు రాసింది. ఆరు సంవత్సరాల వయసు నిండిన పిల్లలకే 1వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని సూచించింది. 1వ తరగతి కంటే ముందు పిల్లలు మూడేళ్లు ప్రీ-స్కూల్ విద్యాభ్యాసం చేసేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యావిధానం-2020 (National Education Policy-2020) కు అనుగుణంగా ఈ సూచనలు పాటించాలని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

కారణమిదే..

Class 1 Admission: పిల్లలకు ప్రారంభ దశలో (ఫౌండేషనల్) విద్యాభ్యాసాన్ని మెరుగుపరచడం జాతీయ విద్యావిధానం-2020లో కీలకమైన విషయంగా ఉంది. ఈ విద్యావిధానం 5+3+3+4 సిస్టమ్‍తో ఉంటుంది. ఇందులో తొలి ఐదు సంవత్సరాల్లో మూడేళ్లు ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ తర్వాత 1,2 తరగతులు ఉంటాయి. కొత్త విద్యా విధానం ప్రకారం.. పిల్లలు అభ్యసించే ప్రీ-స్కూల్ విద్యాభ్యాసం కూడా అధికారిక లెక్కల్లోకి వస్తుంది. పిల్లలందరూ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ పొందాలన్న లక్ష్యంతోనే 1వ తరగతికి ఆరేళ్లు నిండాలన్న నిబంధనను కేంద్రం తీసుకొచ్చింది. అంగన్‍వాడీలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, ఎన్‍జీవోలు నిర్వహించే ప్రీ స్కూళ్లలో.. వేటిలోనైనా మూడేళ్ల పాటు పిల్లలు నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్యను కచ్చితంగా పొందాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పునాది బలంగా ఉంటుందని చెబుతోంది.

Class 1 Admission: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాల్లో 1వ తరగతి అడ్మిషన్‍కు కనీసం పిల్లలకు ఐదు సంవత్సరాలు ఉండాలి. కర్ణాటక, గోవాలో 5 సంవత్సరాల 10 నెలలుగా ఉంది. కేంద్ర సూచనల ప్రకారం, ఈ రాష్ట్రాలు ఒకటో తరగతి అడ్మిషన్లకు కనీస వయసును ఆరు సంవత్సరాలకు పెంచాల్సి ఉంది. మరి రాష్ట్రాల్లో ఎప్పుడు అమల్లోకి తెస్తాయో చూడాలి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ 6 ఏళ్ల నిబంధన ఉంది.

5+3+3+4 సిస్టమ్ ఇదే..

National Education Policy: 10+2 (10వ తరగతి + ఇంటర్) సిస్టమ్ నుంచి జాతీయ విద్యావిధానం-2020 ప్రకారం 5+3+3+4కు మారాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్రం సూచిస్తోంది.

  • 5 (ఫస్ట్ స్టేజ్) - 3 నుంచి 8 సంవత్సరాల వయసు - 3ఏళ్ల ప్రీ-స్కూల్, 1వ,2వ తరగతులు
  • 3 (రెండో స్టేజ్) - 8 నుంచి 11 సంవత్సరాల వయసు - 3 నుంచి 5వ తరగతి
  • 3 (మూడో స్టేజ్) - 11 నుంచి 14 సంవత్సరాల వయసు - 6 నుంచి 8వ తరగతి
  • 4 (నాలుగో స్టేజ్) - 14 నుంచి 18 సంవత్సరాల వయసు - 9 నుంచి 12వ తరగతి (ఇంటర్).

IPL_Entry_Point