Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..
Rains In Telangana : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Telangana rain news : దేశంలో రెండు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతంలో వడగాల్పుల ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. దక్షిణ, ఈశాన్య భారతాల్లో వర్షాలు కురుస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం..
రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణాలో మే 20 వరకు, బిహార్, పశ్చిమబెంగాల్లో మే 19 వరకు, ఒడిశాలో మే 19, 20 తేదీల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మే 18 వరకు గుజరాత్ లో వడగాల్పులు వీస్తాయని, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్లో మరో మూడు రోజుల పాటు వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.
పశ్చిమ రాజస్థాన్లో మే 20 వరకు, పంజాబ్, హరియాణా, దిల్లీలో మరో మూడు రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
Andhra Pradesh rain alert : ఇదిలా ఉండగా.. మే 17న పశ్చిమ బెంగాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులను ఐఎండీ అంచనా వేసింది.
రానున్న 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతం, సిక్కింలో.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
మే 23 వరకు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ- ఆంధ్రలో వర్షాలు..
Hyderabad weather today : మే 23 వరకు తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్లలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కొమోరిన్ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది.
జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ నెల 19 వరకు తేలికపాటి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
వరంగల్లో భారీ వర్షాలు..
Warangal rains : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రానికే వాతావరణం చల్లబడగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది.
ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా, అకాల వర్షానికి చాలా చోట్లా వడ్లు తడిసి పోయాయి. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండటంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇదిలావుంటే ఈదురుగాలుల ప్రభావానికి చాలాచోట్లా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో జనాలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం