Rain alert : 5 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..
Rain alert : 5 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని ఐఎండీ వెల్లడించింది.
Telangana rain alert : భానుడి భగభగలకు అల్లాడిపోయిన దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ (ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఐఎండీ ప్రకారం.. ఒడిశా, అసోం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, ఝార్ఖండ్, మిజోరం, పశ్చిమ్ బెంగాల్, సిక్కిం, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో శుక్రవారం నుంచి 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మిగిలిన రాష్ట్రాల్లో.. అక్కడక్కడా తేలికపాటు, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
Rains in India : ఈ నెల 26 వరకు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. అసోం, మేఘాలయలో 26, 27 తేదీల్లో భారీ వర్షాలు పడతాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరంలో 27 వరకు ఉరుములతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. పశ్చిమ్ బెంగాల్లోని హిమాలయ ప్రాంతంతో పాటు సిక్కింలో 26న, ఝార్ఖండ్ 25, 26 తేదీల్లో వర్షాలు పడతాయి.
జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్లలో 27 వరకు, పంజాబ్, హరియాణ, ఛండీగఢ్, దిల్లీ, తూర్పు రాజస్థాన్లో 25 నుంచి 27 వరకు వానలు కురుస్తాయి. ముఖ్యంగా.. ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Heavy rains in Hyderabad : ఇక కర్ణాటక తీర ప్రాంతంలో 27 వరకు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో 24 వరకు, తెలంగాణలో 25 వరకు, కేరళ మాహేలో 27 వరకు కొన్ని చోట్ల తేలికపాటు, ఇంకొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
సంబంధిత కథనం