రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. వీటితో పాటు జనవరి 15-17 తేదీల మధ్య జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో హిమపాతం హెచ్చరికలు సైతం జారీ చేశారు. అత్యంత దట్టమైన పొగమంచు కోసం ఆరెంజ్ అలర్ట్‌ను కూడా జారీ చేసినట్లు తెలిపింది.
జనవరి 12న ఉదయం దిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్‌డబ్ల్యూఎఫ్‌సీ దిల్లీ అంచనా ప్రకారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జనవరి 14, 15 తేదీల్లో తూర్పు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అసోం, మేఘాలయలో జనవరి 13న ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో జనవరి 15 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. జనవరి 12-14 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, 13,14 తేదీల్లో రాయలసీమ; జనవరి 13-15 మధ్య కేరళ- మాహే. జనవరి 15 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
అటు బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్త ప్రభావం కొనసాగుతోంది. ఫలితంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2025 జనవరి 14 రాత్రి నుంచి వాయవ్య భారతంపై తాజా పశ్చిమ అలజడి ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా జనవరి 15 నుంచి 17 వరకు జమ్మూకశ్మీర్-లడఖ్-గిల్గిట్-బాల్టిస్థాన్-ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, హిమపాతం కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో చలిగాలులు కొనసాగుతున్నాయని.. ఆదివారం లోతట్టు, మైదాన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, మధ్య, ఎత్తైన కొండల్లో మంచు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది.
సంబంధిత కథనం