Railways recruitment: రైల్వేలో భారీ రిక్రూట్ మెంట్; 35 వేల ఉద్యోగాలు-railways recruitment separate exam results job letters for more than 35000 posts by march 2023 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Railways Recruitment: Separate Exam Results, Job Letters For More Than 35000 Posts By March 2023

Railways recruitment: రైల్వేలో భారీ రిక్రూట్ మెంట్; 35 వేల ఉద్యోగాలు

HT Telugu Desk HT Telugu
Nov 18, 2022 07:21 PM IST

భారతీయ రైల్వేలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి తెర లేచింది. దాదాపు 35 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Railways mass recruitment drive: రైల్వే విభాగాల్లో మాస్ రిక్రూట్ మెంట్ జరగనుంది. వచ్చే సంవత్సరం మార్చ్ నాటికి 35 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

Railways mass recruitment drive: 35,281 పోస్ట్ లు..

మొత్తం 35,281 పోస్ట్ లను భారతీయ రైల్వే భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ CEN (centralised employment notice) 2019, ద్వారా జరుగుతుందని భారతీయ రైల్వే సమాచార, ప్రచార విభాగం డైరెక్టర్ అమితాబ్ శర్మ వెల్లడించారు. వివిధ స్థాయిల్లో జరిగే పరీక్షల ఫలితాలను వేరువేరుగా ప్రకటించాలనిభావిస్తున్నామన్నారు. తద్వారా వివిధ పోస్ట్ లకు అప్లై చేసుకున్న ఉద్యోగార్థులు ఇబ్బందులు పడకుండా ఉంటారని, ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తాయని శర్మ వివరించారు.

Railways mass recruitment drive: వేర్వేరుగా ఫలితాలు..

వివిధ స్థాయిల్లోని ఉద్యోగాలకు వేర్వేరుగా ఫలితాలను ప్రకటించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయని అమితాబ్ శర్మ తెలిపారు. అన్నింటికీ కలిపి ఒకే పరీక్ష, ఒకే ఫలితం ప్రకటించడం వల్ల, కొందరు అభ్యర్థులు అన్ని ఉద్యోగాలకు క్వాలిఫై అవుతారని, చివరకు వారు ఏదో ఒక ఉద్యోగాన్నే నిర్ణయించుకుంటారు కనుక మిగతా ఉద్యోగాలు మళ్లీ ఖాళీగానే ఉంటాయని, అందువల్ల ఇతర అభ్యర్థులకు ఆ పోస్ట్ లు పొందే అవకాశం పోతుందని వివరించారు. వేరువేరుగా ఫలితాలను ప్రకటించడం వల్ల ఈ సమస్య పరిష్కారమవుతుందని, ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. 2023 మార్చి నాటికి మొత్తం 32,281 ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

IPL_Entry_Point