Rahul Gandhi to BJP activists: బీజేపీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిసెస్
Rahul Gandhi to BJP activists: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారికి ఫ్లైయింగ్ కిసెస్ తో సమాధానమిస్తున్నారు.
Rahul Gandhi to BJP activists:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త పాద యాత్ర ప్రస్తుతం రాజస్తాన్ లో కొనసాగుతోంది. యాత్రలో రాజస్తాన్ కాంగ్రెస్ లో బద్ధ శత్రువులుగా ఉన్న సీఎం అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్ లు రాహుల్ తో పాటు కలిసి నడుస్తుండడం విశేషం.
Rahul Gandhi waves, blow kisses to BJP supporters: మోదీ, మోదీ నినాదాలు
డిసెబర్ 4న భారత్ జోడో యాత్ర మధ్య ప్రదేశ్ నుంచి రాజస్తాన్ లో ప్రవేశించింది. మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ దాదాపు 380 కిలోమీటర్ల దూరం పాద యాత్ర చేశారు. కాగా, మధ్య ప్రదేశ, రాజస్తాన్ సరిహద్దుల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సోయత్ కలాన్ పట్టణంలోని ఒక వీధిలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలో, ఆ వీధిలో ఉన్న బీజేపీ ఆఫీస్ ఉన్న భవనం పై నుంచి బీజేపీ కార్యకర్తలు మోదీ, మోదీ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దాంతో, రాహుల్ గాంధీ వారివైపు నవ్వుతూ చూస్తూ, ఇంకా గట్టిగా నినాదాలు చేయాలని సైగల ద్వారా సూచించారు. ఆ తరువాత, వారికి ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ ముందుకు సాగారు. రాహుల్ గాంధీ తీరుతో ఆయనతో పాటు నడుస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం మరింత పెరిగింది. వారు మరింత గట్టిగా జై రాహుల్, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
Bharat jodo yatra: ఝలావర్ పట్టణంలోనూ..
ఇలాంటి ఘటనే రాజస్తాన్ లోని ఝలావర్ పట్టణంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతుండగా, అక్కడి బీజేపీ ఆఫీస్ ఉన్న భవనం పైకి కొందరు బీజేపీ మద్దతుదారులు చేరారు. వారిని చూస్తూ కూడా రాహుల్ గాంధీ, చేతులూ ఊపుతూ, ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చారు. ఈ ఘటన కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెంచింది.