Rahul Gandhi: మోకాలి నొప్పికి ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మోకాలి సమస్యతో బాధపడ్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలో మోకాలి నొప్పి సమస్యకు ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మోకాలి సమస్యతో బాధపడ్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలో మోకాలి నొప్పి సమస్యకు ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం ఆయన ఆ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి డిస్చ్చార్జ్ అయ్యే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
భారత్ జోడో యాత్ర
కేరళలోని ప్రముఖ ఆయుర్వేద వైద్య శాలల్లో ఒకటైన కొట్టక్కల్ ఆర్య వైద్య శాలలో రాహుల్ గాంధీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీకి ఆ వైద్య శాల చీఫ్ ఫిజీషియన్, మేనేజింగ్ ట్రస్టీ అయిన డాక్టర్ వారియర్ స్వాగతం పలికారు. భారత జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ వ్యాప్త పాద యాత్ర చేపట్టిన సమయంలో రాహుల్ గాంధీకి ఈ మోకాలి నొప్పి సమస్య తలెత్తినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కేరళలోని ప్రముఖ ఆయుర్వేద వైద్య శాలల్లో ఒకటైన కొట్టక్కల్ ఆర్య వైద్య శాలలో చికిత్స పొందుతున్నారని వివరించారు. రాహుల్ గాంధీ చికిత్స ముగిసిందని, ఆదివారం ఆయన డిస్చార్జ్ అవుతారని పేరు చెప్పడానికి ఇష్టపడని పార్టీ నాయకుడు ఒకరు కోజికోడ్ లో వెల్లడించారు.
కథాకళి నృత్య ప్రదర్శన
కేరళలో రాహుల్ గాంధీ కోసం ప్రత్యేకంగా కథాకళి నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పీఎస్వీ నాట్య సంఘానికి చెందిన కథాకళి కళాకారులు ‘దక్ష యజ్ఞం’ నాటకాన్ని ప్రదర్శించారు. అలాగే, అదే కొట్టక్కల్ ఆర్య వైద్య శాల లో చికిత్స పొందుతున్న మళయాళ రచయిత, దర్శకుడు అయిన వాసుదేవన్ నాయర్ రాహుల్ గాంధీని కలిసి, ఒక పెన్ ను బహూకరించారని వెల్లడించారు.