Rahul Gandhi to compaign in Gujarat: గుజరాత్ లో రాహుల్ గాంధీ ప్రచారం-rahul gandhi to tour gujarat ahead of elections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rahul Gandhi To Tour Gujarat Ahead Of Elections

Rahul Gandhi to compaign in Gujarat: గుజరాత్ లో రాహుల్ గాంధీ ప్రచారం

HT Telugu Desk HT Telugu
Nov 18, 2022 05:55 PM IST

Rahul Gandhi to compaign in Gujarat: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాల నుంచి స్పష్టత వచ్చింది.

భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్రలో సంప్రదాయ తలపాగాతో రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్రలో సంప్రదాయ తలపాగాతో రాహుల్ గాంధీ

Rahul Gandhi to compaign in Gujarat: వచ్చే నెలలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పాల్గొంటారా? లేదా? అనే విషయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Rahul Gandhi to compaign in Saurashtra and South Gujarat: సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో..

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. కానీ ఈ ప్రచారానికి ఆయన ఎక్కువ రోజులు కేటాయించలేరు’ అని కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. నవంబర్ 18 నుంచి రెండు రోజుల పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో రాహుల్ ప్రచార సభలు ఉంటాయన్నారు. భారత్ జోడో యాత్రలో బిజీగా ఉండడం వల్ల ఎక్కువ సమయం ఈ ప్రచారానికి కేటాయించలేకపోతున్నారని వివరించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో తొలి దశ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనే అవకాశముందని పార్టీ నేత హరిప్రసాద్ వివరించారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి గుజరాత్ అసెంబ్లీలో 90 సీట్లు ఉన్నాయి. 182 సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు ఉంటాయి.

BJP criticises Rahul: హిమాచల్ ప్రచారంలో పాల్గొనలేదు

దాదాపు వారం క్రితం ముగిసిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పాల్గొనలేదు. దేశవ్యాప్త పాదయాత్ర భారత్ జోడో యాత్రతో బిజిగా ఉన్న రాహుల్ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కానీ, ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హిమాచల్ ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. మరోవైపు, బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ నడ్డా.. తదితర హేమాహేమీలు హిమాచల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓడిపోతామని తెలిసే, రాహుల్ గాంధీ ఈ ప్రచారంలో పాల్గొనడం లేదని, ప్రచారంలో పాల్గొనే గుండె ధైర్యం రాహుల్ కు లేదని బీజేపీ నేతలు ప్రచారం చేశారు.

IPL_Entry_Point