Rahul Gandhi: సోనియా గాంధీకి సర్ ప్రైజ్; ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ‘లిటిల్ నూరీ’; తల్లికి గిఫ్ట్ గా ఇచ్చిన రాహుల్ గాంధీ
Rahul Gandhi surprises Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ కుటుంబంలోకి కొత్త మెంబర్ వచ్చారు. రాహుల్ గాంధీ తన తల్లి సోనియాకు ఆ మెంబర్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.
Rahul Gandhi surprises Sonia Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన తల్లి సోనియా గాంధీకి అద్భుతమైన బహుమతిని అందించారు. ముందు చెప్పకుండా, ఆ గిఫ్ట్ ను తీసుకువెళ్లి, ఆమెను ఆశ్చర్య పరిచారు.
గోవా నుంచి నేరుగా..
రాహుల్ గాంధీ గోవా నుంచి ఒక చిన్న బుజ్జి కుక్క పిల్లను తెప్పించి, తన తల్లి సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ బుజ్జి కుక్క పిల్లను చూసి ఎంతో సంబరపడిపోయిన సోనియా.. దాన్ని ఎత్తుకుని కాసేపు ముద్దు చేశారు. దానికి ‘నూరీ’ అనే పేరు పెట్టారు. ఈ వీడియోను వరల్డ్ యానిమల్ డే సందర్భగా అక్టోబర్ 4వ తేదీన రాహుల్ గాంధీ తన యూట్యూబ్ వీడియోలో షేర్ చేశారు. మా కుటుంబంలోకి కొత్తగా వచ్చిన అందమైన మెంబర్ ను మీకు అందరికీ చూపించాలని అనుకుంటున్నానని ఆ వీడియోలో రాహుల్ తెలిపారు. ‘‘ ఇది గోవా నుంచి నేరుగా మా చేతుల్లోకి వచ్చింది. మా జీవితాల్లో వెలుగుగా మారింది. అది అందించే అవధులు లేని ప్రేమ, విశ్వాసం.. ఈ చిన్న జంతువు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
జాక్ రస్సెల్ టెర్రియర్
ఆగస్ట్ నెలలో రాహుల్ గాంధీ గోవా వెళ్లారు. అక్కడ డాగ్ బ్రీడర్స్ ను కలిశారు. వారిలో ఒకరు శార్వాణి పిత్రే, స్టాన్లీ బ్రగాంజా దంపతులు. వారి వద్ద ఉన్న కుక్క పిల్లల్లో ఒక బ్రీడ్ ను సెలక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా, ఆ జాక్ రస్సెల్ టెర్రియర్ ‘‘నూరీ’’ (Jack Russel Terrier 'Noorie') ని తెప్పించి తన తల్లికి అమూల్యమైన గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ గిఫ్ట్ ను అందుకున్న సోనియా ప్రేమగా కుమారుడిని దగ్గరికి తీసుకున్నారు. ఆ కుక్క పిల్ల కోసం ఒక చిన్న బెడ్ ను కూడా ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోను ఈ క్రింద చూడండి..
Source: Rahul Gandhi's YouTube Channel, @rahulgandhi