Bharat Jodo Yatra in Maharashtra: నేడు మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర-rahul gandhi bharat jodo yatra to enter maharashtra today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rahul Gandhi Bharat Jodo Yatra To Enter Maharashtra Today

Bharat Jodo Yatra in Maharashtra: నేడు మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర

HT Telugu Desk HT Telugu
Nov 07, 2022 08:05 AM IST

Bharat Jodo Yatra in Maharashtra: భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణలో యాత్రను పూర్తిచేసుకుని మహారాష్ట్రలో అడుగుపెట్టనుంది.

తెలంగాణలో జోడో యాత్రలో రాహుల్ ను కలిసిన మంద కృష్ణ మాదిగ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్
తెలంగాణలో జోడో యాత్రలో రాహుల్ ను కలిసిన మంద కృష్ణ మాదిగ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Telangana Congress Twitter)

నాందేడ్ (మహారాష్ట్ర): దక్షిణాది రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర సోమవారం మహారాష్ట్రలో ప్రవేశించనుంది.

ట్రెండింగ్ వార్తలు

భారత్ జోడో యాత్ర ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది.

ఇప్పుడు, రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం నాందేడ్ జిల్లా దెగ్లూర్‌లోని మద్నూర్ నాకాలో మహారాష్ట్రలో ప్రవేశించనున్నారు.

మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇందుకుగాను విస్తృత ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్రలోనూ పాదయాత్రను విజయవంతం చేయాలని స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారు.

రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ప్రతినిధులు రాత్రి 10 గంటలకు యాత్రను ప్రారంభిస్తారు.

మహారాష్ట్రలో 14 రోజుల పాటు భారత్ జోడో యాత్ర సాగనుంది. మొత్తం 15 అసెంబ్లీ, ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల గుండా 381 కిలోమీటర్లు నడవనున్నారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నవంబర్ 8న యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నందున పవార్ ఈయాత్రలో ఒక కిలోమీటరు దూరం నడుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, మాజీ మంత్రి ఆదిత్య థాకరే తమ షెడ్యూల్‌ను ఇంకా ధృవీకరించలేదు. ఇద్దరూ రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. శివసేనకు చెందిన ఉదవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం నుంచి అరవింద్ సావంత్, మనీషా కయాండే యాత్రలో పాల్గొంటారు.

నానా పటోలే, బాలాసాహెబ్ థోరట్, భాయిజగ్తాప్, అశోక్ చవాన్, తదితరులతో సహా పలువురు ముఖ్య కాంగ్రెస్ నాయకులు భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు.

సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర వచ్చే ఏడాది కాశ్మీర్‌లో ముగుస్తుంది. భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు కాలినడకన సాగిన సుదీర్ఘ పాదయాత్ర ఇదేనని కాంగ్రెస్ గతంలో ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి మద్దతు లభిస్తుండగా, రోజురోజుకూ స్పందన పెరుగుతోంది. మహారాష్ట్రలో కూడా ఎన్‌సిపి, శివసేన (ఠాక్రే వర్గం) యాత్రలో పాల్గొనడానికి అంగీకరించడం యాత్ర ప్రాముఖ్యతను మరింత పెంచింది.

రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఎంపీలు, నేతలు, కార్యకర్తలంతా కంటైనర్లలోనే బస చేయడం గమనార్హం. కొన్ని కంటైనర్లలో స్లీపింగ్ బెడ్‌లు, టాయిలెట్లు, ఏసీలు కూడా అమర్చారు. స్థలాల మార్పుతోపాటు విపరీతమైన వేడి, తేమను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాబోయే ఎన్నికల పోరాటాల కోసం పార్టీ శ్రేణులను కూడగట్టే ప్రయత్నంగా ఈ యాత్రను చూస్తున్నారు.

IPL_Entry_Point