QS University Rankings: క్యూఎస్ ఆసియా యూనివర్శిటీ ర్యాంకింగ్స్ - 2025 టాప్ 100 లిస్ట్ లో భారత్ నుంచి 6 విద్యా సంస్థలు-qs world university rankings asia 2025 6 indian institutions in top 100 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Qs University Rankings: క్యూఎస్ ఆసియా యూనివర్శిటీ ర్యాంకింగ్స్ - 2025 టాప్ 100 లిస్ట్ లో భారత్ నుంచి 6 విద్యా సంస్థలు

QS University Rankings: క్యూఎస్ ఆసియా యూనివర్శిటీ ర్యాంకింగ్స్ - 2025 టాప్ 100 లిస్ట్ లో భారత్ నుంచి 6 విద్యా సంస్థలు

Sudarshan V HT Telugu
Nov 07, 2024 09:52 PM IST

క్యూఎస్ ఆసియా యూనివర్శిటీ ర్యాంకింగ్స్ - 2025 టాప్ 100 లిస్ట్ లో భారత్ నుంచి 6 విద్యా సంస్థలు చోటు సంపాదించాయి. వాటిలో ఐఐటీ ఢిల్లీ తొలి స్థానంలో ఉంది.

టాప్ 100 లిస్ట్ లో భారత్ నుంచి 6 విద్యా సంస్థలు
టాప్ 100 లిస్ట్ లో భారత్ నుంచి 6 విద్యా సంస్థలు (Agency File Photo)

QS University Rankings: ప్రపంచ ప్రసిద్ధ క్వాక్వెరెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ సంస్థ ఆసియా 2025 జాబితాను అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. క్యూఎస్ రూపొందించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి మొత్తం 22 యూనివర్సిటీలు ఆసియా రీజియన్ లో చోటు దక్కించుకున్నాయి.

టాప్ 100 లో ఆరు

ఆసియా ప్రాంతం నుంచి మొత్తం 984 విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా అందులో భారత్ నుంచి 22 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.ఆసియాలోని టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో మన దేశానికి చెందిన 6 విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీడీ) 44వ స్థానంతో అగ్రస్థానంలో నిలవగా, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (ఐఐటీబీ) 48వ స్థానంలో, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం) 56వ స్థానంలో నిలిచాయి.

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీడీ) - ర్యాంక్ 44

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (ఐఐటీబీ) - ర్యాంక్ 48

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం) - ర్యాంక్ 56

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్ పూర్ (ఐఐటీ-కేజీపీ) - ర్యాంక్ 60

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - ర్యాంక్ 62

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటీకే) - 67వ ర్యాంకు

దక్షిణాసియా కేటగిరీలో..

భారత్, పాకిస్థాన్ కు చెందిన విశ్వవిద్యాలయాలు ఉన్న దక్షిణాసియా కేటగిరీలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీడీ) 308 విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దక్షిణాసియా కేటగిరీలో టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో 7 భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎన్ యూఎస్టీ) ఇస్లామాబాద్ దక్షిణాసియా విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటీకే)తో కలిసి 6వ స్థానాన్ని పంచుకుంది. అంతర్జాతీయ ఫ్యాకల్టీ, పీహెచ్ డీతో కూడిన సిబ్బంది, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, ఇన్ బౌండ్ ఎక్స్ఛేంజ్, అకడమిక్ ఖ్యాతి, పేపర్ సైటేషన్స్, ఫ్యాకల్టీ పేపర్స్, ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్ వర్క్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఔట్ బౌండ్ ఎక్స్ఛేంజ్, ఎంప్లాయర్ రెప్యూషన్ వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు.

Whats_app_banner