రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం తెలిపారు.
“భారత్‌కు రావడానికి భారత ప్రభుత్వ అధిపతి నుండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానాన్ని అంగీకరించారు. రష్యా అధ్యక్షుడి భారత దేశ సందర్శనకు సన్నాహాలు జరుగుతున్నాయి” అని లావ్రోవ్ చెప్పారు.
గత సంవత్సరం తిరిగి ఎన్నికైన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా రష్యాకు వచ్చారని, “ఇప్పుడు మా వంతు” అని అన్నారు.
రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ (RIAC) ఆధ్వర్యంలో జరిగిన “రష్యా మరియు భారత్: ఒక కొత్త ద్వైపాక్షిక ఎజెండా వైపు” అనే శీర్షికతో జరిగిన సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు ఎప్పుడు వస్తారనే విషయం ఇంకా ప్రకటించలేదు.
జూలై 2024లో, ప్రధానమంత్రి మోడీ రష్యాను సందర్శించారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మోడీ రష్యా పర్యటన ఇది. ఈ పర్యటనలో, మోడీ రష్యా అధ్యక్షుడిని భారత్‌కు రావడానికి ఆహ్వానించారు.
వ్లాదిమిర్ పుతిన్ చివరిసారిగా డిసెంబర్ 2021లో వార్షిక సదస్సు కోసం భారత్‌కు వచ్చారు. ప్రతిపాదిత పర్యటన 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా జరుగుతుంది.
టాపిక్