Putin humiliates Trump: ట్రంప్ ను అవమానించిన పుతిన్; ఫోన్ కాల్ కోసం గంటకు పైగా ఎదురు చూపులు-putin humiliates trump keeps us president waiting for an hour brutal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Putin Humiliates Trump: ట్రంప్ ను అవమానించిన పుతిన్; ఫోన్ కాల్ కోసం గంటకు పైగా ఎదురు చూపులు

Putin humiliates Trump: ట్రంప్ ను అవమానించిన పుతిన్; ఫోన్ కాల్ కోసం గంటకు పైగా ఎదురు చూపులు

Sudarshan V HT Telugu

Putin humiliates Trump: ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేయడానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మధ్య రెండు గంటల పాటు ఫోన్ లో చర్చ జరిగింది. అయితే, ఈ చర్చకు ముందు పుతిన్ ఫోన్ కాల్ కోసం ట్రంప్ గంటకు పైగా వేచి ఉన్నారు.

ట్రంప్ ను అవమానించిన పుతిన్ (AFP)

Putin humiliates Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అవమానించారా? అంటే అవుననే స్పందిస్తోంది సోషల్ మీడియా. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు అయితే, ఆ చర్చలకు ముందు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ ను గంటకు పైగా వేచి ఉంచారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు, ఆయన బృందం కోరిన ఉక్రెయిన్ లో 30 రోజుల కాల్పుల విరమణ గడువును ఇవ్వడానికి పుతిన్ నిరాకరించారు. అందుకు బదులుగా, ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను పరిమితం చేయడానికి మాత్రమే పుతిన్ అంగీకరించారు.

మాస్కోలో మీటింగ్ లో పుతిన్ బిజీ

ఈ చర్చ సందర్భంగా ట్రంప్ ను పుతిన్ 60 నిమిషాలకు పైగా నిరీక్షించేలా చేశారని, ట్రంప్ ను పుతిన్ అవమానించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ట్రంప్ ఫోన్ కాల్ షెడ్యూల్ కు ముందు పుతిన్ మాస్కోలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్ వెయిట్ చేస్తున్నారని, తన వ్యక్తిగత సిబ్బంది పుతిన్ కు గుర్తు చేసినప్పుడు, పుతిన్ నవ్వుతూ ఆలస్యంగా వస్తానని సూచిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. పుతిన్ ఆ సమయంలో మాస్కోలో జరిగిన వార్షిక కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు.

గంటకు పైగా ట్రంప్ వెయిటింగ్..

రష్యా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. సాయంత్రం 4 గంటలకు కొద్ది సేపటి తరువాత, ట్రంప్ కాల్ కు ఆలస్యమవుతోందని సిబ్బంది పుతిన్ కు గుర్తు చేశారు. దానికి రష్యా అధ్యక్షుడు చిరునవ్వుతో, భుజాలు ష్రగ్ చేస్తూ కనిపించారు. అనంతరం, దాదాపు ఒక గంట ఆలస్యంగా, సాయంత్రం 5 గంటలకు పుతిన్ అధ్యక్ష భవనం చేరుకుని ట్రంప్ కాల్ ను అటెండ్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి.

ట్రంప్ ను అవమానించడమే..

పుతిన్ కావాలనే, ట్రంప్ ను అవమానించాలనే ఇలా చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు ప్రారంభమయ్యాయి. దీనిని పుతిన్ పవర్ ప్లేకు దక్కిన విజయంగా పలువురు అభివర్ణించారు. "నాయకులను వేచి ఉండేలా చేయడం పాత పుతిన్ పవర్ ప్లే. కానీ ఇది చాలా క్రూరమైనది" అని ఒక ఎక్స్ యూజర్ రాశారు. ‘‘పుతిన్ డోనాల్డ్ ట్రంప్ ను దారుణంగా అవమానించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది' అని మరో ఎక్స్ యూజర్ కామెంట్ చేశారు. ‘‘అసలు కాల్పుల విరమణ ఉద్దేశం పుతిన్ కు లేదు’’ అని మరో యూజర్ కామెంట్ చేశారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.