Indian student: భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన రూమ్మేట్
Indian student killed: తన రూమ్ మేట్ అయిన విద్యార్థిని మరొక విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కిచెన్ లో గొడవతో ప్రారంభమై, హత్యతో ముగిసిన ఈ ఘటన కెనడాలో జరిగింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Indian student killed in Canada: భారత్ కు చెందిన ఓ విద్యార్థిని అతడి రూమ్మేట్ హత్య చేశాడు. కిచెన్ లో చిన్న గొడవతో ప్రారంభమై కత్తిపోట్ల వరకు వెళ్లింది. ఈ ఘటనలో పంజాబ్ కు చెందిన విద్యార్థి గుర్యాసిస్ సింగ్ బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన కాల్ కు స్పందించిన పోలీసులు ఒంటారియో ప్రావిన్స్ లోని సార్నియా పట్టణంలోని వారి నివాసానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
లాంబ్టన్ కాలేజీ విద్యార్థి
పోస్టుమార్టం విచారణ పూర్తయిన తర్వాత మృతుడు లాంబ్టన్ కాలేజీలో బిజినెస్ చదువుతున్న భారతీయ పౌరుడు 22 ఏళ్ల గుర్యాసిస్ సింగ్ గా సర్నియా పోలీసులు గుర్తించారు. అతడిని హత్య చేసిన 36 ఏళ్ల క్రాస్లీ హంటర్ పై సెకండ్ డిగ్రీ హత్యానేరం కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితుడు ఒకే గదిలో నివసిస్తున్నారని, వంటగదిలో ఉన్నప్పుడు వారి మధ్య వాగ్వాదం ప్రారంభమైందని సర్నియా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గొడవలో నిందితుడు క్రాస్లీ హంటర్ గుర్యాసిస్ సింగ్ ను పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు.
కుటుంబ సభ్యులకు సమాచారం
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని సార్నియా పోలీస్ చీఫ్ డెరెక్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ హత్య (Murder) కు సంబంధించిన అన్ని ఆధారాలను సర్నియా పోలీసు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం సేకరిస్తూనే ఉంది. ఈ నేరం జాతి వివక్ష ప్రేరేపితమని మేము విశ్వసించడం లేదు’’ అని తెలిపారు. ఈ ఘటనపై లాంబ్టన్ కాలేజ్ స్పందించింది. ఈ ఘటనతో ఒక విద్యార్థిని కోల్పోవడం అత్యంత పెద్ద విషాదమని, ఆ విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని ప్రకటించింది. విద్యార్థి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని భారత్ కు పంపించడంపై వారితో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.
టాపిక్