Punjab: పంజాబ్ లో ఒంటి పూట ప్రభుత్వ కార్యాలయాలు; ఇక మధ్యాహ్నం వరకే ఆఫీస్ డ్యూటీ-punjab govt offices to operate from 7 30am to 2pm from 2 may ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Punjab: పంజాబ్ లో ఒంటి పూట ప్రభుత్వ కార్యాలయాలు; ఇక మధ్యాహ్నం వరకే ఆఫీస్ డ్యూటీ

Punjab: పంజాబ్ లో ఒంటి పూట ప్రభుత్వ కార్యాలయాలు; ఇక మధ్యాహ్నం వరకే ఆఫీస్ డ్యూటీ

HT Telugu Desk HT Telugu
Published Apr 08, 2023 08:06 PM IST

Punjab govt offices to operate half day: పంజాబ్ (Punjab) లో ప్రభుత్వ కార్యాలయాల టైమింగ్స్ మారుస్తూ ముఖ్యమంత్రి భగవంత్ మన్ (Bhagwant Mann) కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 2వ తేదీ నుంచి పంజాబ్ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్

Punjab govt offices to operate half day: పంజాబ్ (Punjab) లో ప్రభుత్వ కార్యాలయాలు మే 2వ తేదీ నుంచి ఒక్క పూట మాత్రమే పని చేస్తాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి భగవంత్ మన్ (Punjab Chief Minister Bhagwant Mann) శనివారం ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వేసవి కారణంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు (Punjab) ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ (Punjab Chief Minister Bhagwant Mann) వివరించారు. ఆ రోజు నుంచి తాను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీస్ కు చేరుకుంటానన్నారు.

Half day offices in Punjab: మధ్యాహ్నం వరకే ఆఫీసులు

మే 2వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు పంజాబ్ (Punjab) లో ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తున్నాయి. ఎంతో మందితో చర్చించిన తరువాత ఈ టైమింగ్స్ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు మన్ (Punjab Chief Minister Bhagwant Mann) వెల్లడించారు. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, ఆ మేరకు విద్యుత్ ను వ్యవసాయం వంటి ఇతర అత్యవసరాలకు వినియోగించాలన్నది తమ ఆలోచన అని వెల్లడించారు. పంజాబ్ (Punjab) లో రోజువారీ విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే, గరిష్ట వినియోగం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆఫీస్ లను మూసేయడం ద్వారా రోజువారీ విద్యుత్ వినియోగం 300 నుంచి 350 మెగా వాట్స్ వరకు తగ్గుతుందని భావిస్తున్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.