Punjab Vigilance Bureau Chief : పంజాబ్ విజిలెన్స్ బ్యూరో చీఫ్ డైరెక్టర్‌గా నాగేశ్వరరావు
Punjab Vigilance Bureau Chief : పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర విజిలెన్స్ బ్యూర్ చీఫ్ డైరెక్టర్‌గా జి.నాగేశ్వరరావును నియమించింది. వరీందర్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించింది.

పంజాబ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో చీఫ్ డైరెక్టర్ బాధ్యతల నుండి వరీందర్ కుమార్‌ను తప్పించింది. ఆయనను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేసింది. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ప్రొవిజనింగ్) జి.నాగేశ్వరరావును విజిలెన్స్ బ్యూరో కొత్త చీఫ్ డైరెక్టర్‌గా నియమించింది ప్రభుత్వం. వరీందర్ కుమార్‌ను చీఫ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి.. డీజీపీ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించారు.
ఈ ఆకస్మిక చర్య అధికార వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. వరీందర్ కుమార్ తొలగింపుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అవినీతిని ఏమాత్రం సహించకూడదని, అందరు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఈ మార్పుపై ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి.
1993 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్(IPS) అధికారి అయిన వరీందర్ కుమార్ జూలై 31, 2025న పదవీ విరమణ చేయనున్నారు . రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే ఆయన మే 2022లో విజిలెన్స్ చీఫ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జి.నాగేశ్వరరావు 1995 బ్యాచ్ అధికారి.
ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ప్రొవిజనింగ్)గా ఉన్న నాగేశ్వరరావు రావు, చీఫ్ డైరెక్టర్ బాధ్యతల నుండి రిలీవ్ అయిన వరీందర్ కుమార్ స్థానంలో నియమితులయ్యారు. పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు రిపోర్ట్ చేయాలి.
విజిలెన్స్ చీఫ్‌ను తొలగించే రెండు రోజుల ముందు పంజాబ్ ప్రభుత్వం ఏ రకమైన అవినీతిని సహించబోమని ఆదేశిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ సందర్భంలో విజిలెన్స్ చీఫ్‌ను తొలగించడంపై ఆసక్తి నెలకొంది. రాబోయే రోజుల్లో పంజాబ్ ప్రభుత్వం ఇలాంటి కఠినమైన చర్యలు మరిన్ని తీసుకోవచ్చని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్