డెలివరీ బాయ్ నని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం; సెల్ఫీ తీసుకుని బెదిరింపు-pune woman opens door to fake courier raped left with selfie warning ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  డెలివరీ బాయ్ నని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం; సెల్ఫీ తీసుకుని బెదిరింపు

డెలివరీ బాయ్ నని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం; సెల్ఫీ తీసుకుని బెదిరింపు

Sudarshan V HT Telugu

పూణేలోని కొంధ్వా ప్రాంతంలోని యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి తాను కొరియర్ డెలివరీ బాయ్ నని చెప్పడంతో ఆ యువతి తలుపు తెరిచింది. దాంతో ఇంట్లోకి ప్రవేశించిన ఆ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

పూణేలో యువతిపై అత్యాచారం (PTI file photo)

మహారాష్ట్రలోని పుణెలో కొరియర్ డెలివరీ బాయ్ నని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత, అతడు ఆ యువతితో సెల్ఫీ దిగి, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.

డెలివరీ బాయ్ నని చెప్పి..

పుణెలోని కొంధ్వా ప్రాంతంలో ఉన్న హౌసింగ్ సొసైటీలో రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కొరియర్ వచ్చిందని, దాన్ని డెలివరీ చేయడానకిి వచ్చానని చెప్పి మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి తలుపు తట్టాడు. ఆ సమయంలో ఆమె సోదరుడు పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో ఆ యువతి ఒంటరిగా ఉండడంతో ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం, బాధితురాలితో సెల్ఫీ తీసుకొని, నేరం గురించి ఎవరికీ చెప్పొద్దని, ఎవరికైనా చెబితే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరించాడు.

పోలీసులకు ఫిర్యాదు

‘‘నిన్న రాత్రి 7.30 గంటల సమయంలో డెలివరీ బాయ్ ని అని చెప్పి బ్యాంక్ కవర్ తో నిందితుడు 22 ఏళ్ల ఆ యువతి ఫ్లాట్ లోకి ప్రవేశించాడు. కొరియర్ కోసం పిన్ తీసుకురావడానికి ఆమె తన ఇంట్లోకి వెళ్లగా, అతను తలుపు మూసివేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు’’ అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (జోన్ 5) రాజ్ కుమార్ షిండే తెలిపారు.

మత్తులోకి నెట్టి..

ఆ ఘటన తరువాత బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రాత్రి 8.30 గంటల సమయంలో స్పృహలోకి వచ్చిన తరువాత కూడా వెంటనే ఆమెకు ఏమీ గుర్తురాలేదు. ఆ తరువాత బాధితురాలు తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అత్యాచారం చేసిన తరువాత ఆమెను అపస్మారక స్థితిలోకి నెట్టేందుకు దుండగుడు ఏదైనా మత్తు పదార్థాన్ని కానీ, స్ప్రేను కానీ ఉపయోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ విషయాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులను సంఘటనా స్థలానికి పిలిపించారు.

కేసు నమోదు

పుణెలోని కొంధ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో బీఎన్ఎస్ సెక్షన్లు 64, 77, 351(2) కింద కేసు నమోదు చేశామని డీసీపీ షిండే తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ కు చెందిన ఐదు బృందాలు, ఐదు జోనల్ బృందాలు కలిపి మొత్తం 10 బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి ముఖం రికార్డవడంతో పోలీసులు అతడిని గుర్తించి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.