Pulwama terror attack : ఉగ్రదాడిలో పోలీసు మృతి, జవానుకు తీవ్ర గాయాలు
Pulwama terror attack : పుల్వామాలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో ఓ పోలీసు వీరమరణం పొందారు. మరో జవానుకు గాయాలయ్యాయి.
Pulwama terror attack today : జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు మరణించారు. మరో సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాను తీవ్రంగా గాయపడ్డాడు.
ట్రెండింగ్ వార్తలు
"సీఆర్పీఎఫ్, పోలీసుల బృందంపై పుల్వామా పింగ్లానా ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఒక పోలీసు వీరమరణం పొందారు. మరో సీఆర్పీఎఫ్ జవానుకు గాయాలయ్యాయి," అని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
ఘటనపై వేగంగా స్పందించామని, ఘటనాస్థలానికి అదనపు సిబ్బందిని తరలించామని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలానికి చుట్టుపక్కన ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలను ముమ్మరం చేశామని స్పష్టం చేశారు.
ఆ ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల తర్వాత…!
Shopian encounter today : షోపియాన్‌లో ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పుల్వామాలో ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం. ఆ ఎన్కౌంటర్లో.. మూడు గంటల ఆపరేషన్ అనంతరం ఓ లష్కర్ ఉగ్రవాదిని జవాన్లు మట్టుబెట్టారు.
అమిత్ షా జమ్ముకశ్మీర్ పర్యటన వేళ..
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మూడు రోజుల పర్యటన కోసం సోమవారం జమ్ముకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఆ ప్రాంతంలోని ప్రస్తుత భద్రతాపరమైన పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. వీటితో పాటు.. రాజౌరీ, బారాముల్లా జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ర్యాలీలు పాల్గొననున్నారు అమిత్ షా.
Amit Shah Jammu Kashmir visit : అమిత్ షా పర్యటనకు ఒక్క రోజు.. రెండు వేరు వేరు ప్రాంతాల్లో ఆందోళన చెలరేగడం సర్వత్రా చర్చకు దారితీసింది.
సంబంధిత కథనం