Wrestlers ‘to throw medals in Ganga’: పతకాలను గంగానదిలో వేసేయనున్న రెజ్లర్లు; ఆ తరువాత ఆమరణ నిరాహార దీక్ష-protesting wrestlers to throw medals in ganga in haridwar today sit on hunger strike at india gate ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Protesting Wrestlers 'To Throw Medals In Ganga' In Haridwar Today, Sit On Hunger Strike At India Gate

Wrestlers ‘to throw medals in Ganga’: పతకాలను గంగానదిలో వేసేయనున్న రెజ్లర్లు; ఆ తరువాత ఆమరణ నిరాహార దీక్ష

HT Telugu Desk HT Telugu
May 30, 2023 02:18 PM IST

Wrestlers ‘to throw medals in Ganga’: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Wrestling Federation of India) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ గత కొంత కాలంగా నిరసన తెలుపుతున్న భారత దేశ టాప్ రెజ్లర్లు తమ ఆందోళనలను మరింత తీవ్రం చేయాలని నిర్ణయించారు.

రెజ్లర్లకు మద్దతు తెలుపుతున్న పౌర సమాజం.
రెజ్లర్లకు మద్దతు తెలుపుతున్న పౌర సమాజం. (PTI)

Wrestling Federation of India president Brij Bhushan Singh: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Wrestling Federation of India) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ గత కొంత కాలంగా భారత టాప్ రెజ్లర్లు నిరసన తెలుపుతున్నారు. ఒలంపిక్స్ సహా పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలను సాధించిన రెజ్లర్లు ఇలా రోడ్డెక్కి నిరసన చేపట్టడం సంచలనంగా మారింది. సహచర క్రీడాకారులు, విపక్షాల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Wrestlers ‘to throw medals in Ganga’: గంగానదిలో పతకాలు..

ఈ నేపథ్యంలో తమ నిరసనను మరింత తీవ్రం చేయాలని రెజ్లర్లు నిర్ణయించారు. వివిధ పోటీల్లో తాము సాధించిన పతకాలను గంగానదిలో వేసేయాలని నిర్ణయించారు. తమ ఆందోళనను ఏమాత్రం సానుభూతితో అర్థం చేసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తాము సాధించిన పతకాలను హరిద్వార్ లో గంగానదిలో కలిపేయనున్నామని ఒక ప్రకటన విడుదల చేశారు.

indefinite hunger strike by Wrestlers: ఆమరణ నిరాహార దీక్ష

హరిద్వార్ లో తమ పతకాలను గంగానదిలో వేసిన అనంతరం, ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామని సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ తదితర రెజ్లర్లు ప్రకటించారు. ‘ఈ మెడల్సే మా జీవితం. ఈ మెడల్సే మా ప్రాణం. వాటిని గంగానదిలో వేసిన అనంతరం మా జీవితాలకు, మా ప్రాణాలకు అర్థం లేదు. అందుకే, వాటిని గంగానదిలో వేసిన అనంతరం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నాం’ అని వారు ఒక సంయుక్త ప్రకటనలో వివరించారు. ‘‘ప్రధాని మోదీ మమ్మల్ని తన బిడ్డలని అంటారు. కానీ మా అందోళనపై ఆయన కనీసం జాలి చూపలేదు. పైగా, మాపై దారుణాలు చేసిన ఎంపీ బృజ్ భూషణ్ ను కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు’’ అని ప్రధాని మోదీని విమర్శించారు.

Abhinav Bindra reaction: అభినవ్ బింద్రా సంఘీభావం

ఢిల్లీలో నిరసన తెలుపుతూ, ‘మహిళా మహా పంచాయత్’ నిర్వహించే ఉద్దేశంతో కొత్త పార్లమెంటు భవనం వైపు వెళ్తున్న రెజ్లర్లను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లపై వారు దురుసుగా ప్రవర్తించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెజ్లర్లపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఒలింపిక్స్ లో షూటింగ్ లో బంగారు పతకం సాధించిన అభినవ్ బింద్రా, భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ ఛెత్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో చూసిన తనకు ఆందోళనతో నిద్ర కూడా పట్టలేదని బింద్రా వ్యాఖ్యానించారు.

WhatsApp channel