Prolonged sitting side effects : మీరు గంటల తరబడి కూర్చూనే ఉండిపోతున్నారా? కూర్చునే అన్ని పనులు చేస్తున్నారా? అయితే.. ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! ఎక్కువ సేపు కూర్చునే ఉంటే.. అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా.. ఈ స్టడీని నిర్వహించింది. 63-99ఏళ్ల మధ్యలో ఉన్న 5,856 మంది మహిళలను దశాబ్ద కాలం పాటు మానిటర్ చేసింది. వీరిలో 1,733 మంది మరణించారు.
అధ్యయనం ప్రకారం.. రోజుకు 11 గంటల పాటు కూర్చునే ఉండిపోయిన వారికి, (తొమ్మిదిన్నర గంటల పాటు కూర్చునే వారితో పోల్చితే) మరణించే రిస్క్ 57శాతం అధికంగా ఉంటుందట!
ఎక్కువ కూర్చుని ఉన్నా పర్లేదు, వ్యాయామాలు చేస్తే చాలని చాలా మంది చెబుతుంటారు. కానీ.. అందులో నిజం లేదని, తాజా అధ్యయనం తేల్చేసింది! ఎంత ఎక్కువ వ్యాయామాలు చేసినా.. తొందరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
అయితే.. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ అధ్యయనం.. తాజా స్టడీకి వ్యతిరేకంగా ఉంది! ఎక్కువ సేపు కూర్చున్నా.. రోజుకు 9వేలు- 10,500 స్టెప్స్ వేస్తే, ప్రీ-మెచ్యూర్ డెత్ ప్రమాదం తగ్గుతుందని ఆ అధ్యయనం చెప్పుకొచ్చింది.
Prolonged sitting death : మరి ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకు ఉంది? అంటే.. డేటా ఇంటర్‌ప్రిటేషన్ మెథడ్, యాక్టివిటీ మానిటరింగ్ సెటప్‌లో డిఫరెన్స్ వంటివి కారణాలుగా ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో.. వ్రిస్ట్కి మానిటర్స్ పెట్టారు. పైగా.. సిట్టింగ్, స్టాండింగ్ టైమ్‌ని నిర్ధరించేందుకు స్పెసిఫిక్ సాఫ్ట్ట్వేర్ని వాడలేదు.
పెద్దవారు.. కూర్చునే సమయాన్ని తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అవసరమైతే.. సిట్టింగ్స్ మధ్యలో లంగ్ బ్రేక్స్ తీసుకోవాలని చెబుతోంది.
Prolonged sitting health issues : మరోవైపు.. 7 గంటల పాటు కూర్చునే ఉన్నా.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పలు ఇతర అధ్యయనలు చెబుతున్నాయి. 30 గంట సేపు కూర్చున్నా.. బ్లడ్ షుగర్ లెవల్స్, బీపీ పెరుగుతాయని హెచ్చరిస్తున్నాయి.
సంబంధిత కథనం