Manipur viral video : సీబీఐ చేతికి.. మణిపూర్​ వైరల్​ వీడియో కేసు-probe into manipur viral video case transferred to cbi centre tells sc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Probe Into Manipur Viral Video Case Transferred To Cbi, Centre Tells Sc

Manipur viral video : సీబీఐ చేతికి.. మణిపూర్​ వైరల్​ వీడియో కేసు

Sharath Chitturi HT Telugu
Jul 28, 2023 06:45 AM IST

Manipur viral video case : మణిపూర్​ వైరల్​ వీడియోకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. ఈ మేరకు ఓ అఫిడవిట్​ను దాఖలు చేసింది.

సీబీఐ చేతికి.. మణిపూర్​ వైరల్​ వీడియో కేసు
సీబీఐ చేతికి.. మణిపూర్​ వైరల్​ వీడియో కేసు

Manipur viral video case : మణిపూర్​లో ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి ఊరేగించిన సంఘటనకు సంబంధించిన కేసును సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)కి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను, మణిపూర్​ బయట నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

అఫిడవిట్​లో ఉన్న వివరాలు..

ఈ ఏడాది మే 3 మణిపూర్​లో నిరసనలు మొదలయ్యాయి. కాగా.. మే 4న కుకి జాతికి చెందిన ఓ గ్రామంపై దాడి చేసిన దుండగులు.. ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి, ఊరేగించారు. ఓ ఫేక్​ వీడియోను చూసి, కోపంతో ఈ దారుణానికి ఒడిగనట్టు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు జులై 20 ప్రాంతంలో బయటకొచ్చాయి. ఫలితంగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్​ వేదికగా ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై స్పందించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

సుప్రీంకోర్టులో ఉన్న మణిపూర్​ వీడియో కేసుకు సంబంధించి అఫిడవిట్​ను దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం.

Manipur violence latest news : "నిందితులను పట్టుకునేందుకు అనేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాము. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఎస్​పీ ర్యాంక్​ అధికారికి అప్పగించాము. ఇతర సీనియర్​ అధికారుల పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్​ చేశాము. చివరిగా.. ఓ వ్యక్తిని సోమవారం అరెస్ట్​ చేశాము. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించుకున్నాము." అని అఫిడవిట్​లో పేర్కొంది కేంద్రం.

"మహిళలపై నేరాలను కేంద్రం సహించబోదు. మణిపూర్​లో జరిగింది అత్యంత ఘోరమైన ఘటన అని కేంద్రం భావిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించడమే కాకుండా.. బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది," అని కేంద్రం స్పష్టం చేసింది.

మరోవైపు మణిపూర్​ వైరల్​ వీడియో ఘటనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో మానవ హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. యూరోపియన్​ పార్లమెంట్​ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని కేంద్రం తిప్పికొట్టింది. ఇది భారత దేశ అంతర్గత విషయం అని, ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

WhatsApp channel

సంబంధిత కథనం