Priyanka Gandhi in Karnataka: ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు..-priyanka gandhi hits out at pm modi during karnataka polls campaign comes crying to gain sympathy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Priyanka Gandhi In Karnataka: ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు..

Priyanka Gandhi in Karnataka: ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు..

HT Telugu Desk HT Telugu
May 03, 2023 10:00 PM IST

Priyanka Gandhi in Karnataka: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) పాల్గొన్నారు. కర్నాటకలో పలు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) పై ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ (AICC)

Priyanka Gandhi in Karnataka: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (karnataka elections) ప్రచారంలో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) పాల్గొన్నారు. కర్నాటకలో పలు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) పై ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Priyanka Gandhi Criticizes PM Modi: సానుభూతి కోసం ఏడుపు నటిస్తూ వస్తారు..

ప్రజల్లో సానుభూతి సంపాదించి, తద్వారా ఓట్లను పొందడం కోసం ఏడుపు నటిస్తూ ఓటర్ల వద్దకు వస్తున్నారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ (congress) సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) వ్యంగ్య విమర్శలు చేశారు. కర్నాటకలోని మాండ్య జిల్లాలోని హోస్కోటెలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం (karnataka elections) లో బుధవారం ఆమె పాల్గొన్నారు. ‘‘ప్రధాని మోదీ (PM Modi) కి ప్రజల కన్నీళ్లు, కష్టాలు, కడగండ్లు అవసరం లేదు. వారి సమస్యలు తీర్చాలన్న ఆలోచన లేదు. ఏడుస్తూ, మొసలి కన్నీరు కారుస్తూ ఓటర్ల సానుభూతి పొంది, తద్వారా ఓట్లు సాధించడం కోసం మీ వద్దకు వస్తాడు’’ అని మోదీపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ప్రియాంక మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా కాంగ్రెస్ కు ఓటేయాలని ఆమె కోరారు.

Priyanka Gandhi in Karnataka: ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వాన్ని దోచుకునే దొంగలు

ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వాలను దొంగతనం చేసే కొత్త తరహా దొంగలు వస్తున్నారని బీజేపీపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘సాధారణంగా రకరకాల దొంగలు ఉంటారు. కొందరు ఇళ్లల్లో పడి దొంగతనం చేస్తారు. కొందరు బెదిరించి దోచుకుంటారు. ఇప్పుడు కొత్త రకం దొంగలు.. ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వాలను దొంగతనం చేసే దొంగలు వచ్చారు. వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘నన్ను తిడుతున్నారని ప్రజల ముందుకు వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చే బదులు.. దేశం కోసం దూషణలనే కాదు.. బుల్లెట్లనైనా ఎదుర్కొంటాను అని ధైర్యంగా చెప్పిన నా అన్న రాహుల్ గాంధీని చూసి నేర్చుకో’’ అని ప్రధాని మోదీ(PM Modi) కి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సూచించారు. ‘‘నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ వారు చేసిన వ్యక్తిగత దూషణలను లెక్కిస్తే, ఏకంగా కొన్ని పుస్తకాలనే పబ్లిష్ చేయొచ్చు’ అన్నారు.

Whats_app_banner