మానవ అక్రమ రవాణా కేసులో అభియోగాలు వెనక్కి తీసుకున్న అమెరికా పోలీసులు
అమెరికాలో మానవ అక్రమ రవాణాకు పాల్పడిన అభియోగాలపై నలుగురు తెలుగు వారిని అరెస్ట్ చేసిన ప్రిన్స్‌టన్ పోలీసులు ఆయా అభియోగాలను వెనక్కి తీసుకున్నారు.
అభియోగాలను వెనక్కి తీసుకున్న పోలీసులు (ప్రతీకాత్మక చిత్రం) (HT_PRINT)
అమెరికాలో మానవ అక్రమ రవాణాకు పాల్పడిన అభియోగాలపై నలుగురు తెలుగు వారిని ప్రిన్స్‌టన్ పోలీసులు గత ఏడాది జులైలో అరెస్టు చేశారు. ఈమేరకు స్థానిక పోలీసులు అధికారికంగా ప్రకటించారు. నకిలీ కంపెనీలు సృష్టించి యువతులను అమెరికా తీసుకెళ్లి వారితో బలవంతంగా పని చేయిస్తున్నట్లు పోలీసులు అభియోగాలు మోపారు.
ఈ కేసులో సంతోష్ కట్కూరి, ద్వారక, చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలెను అరెస్ట్ చేశారు. డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీకి చెందిన ఈ నలుగురు... యువతులను అక్రమ రవాణా చేసి వారితో బలవంతంగా పనిచేయిస్తున్నారని అభియోగాలు మోపారు.
అయితే ఇటీవల అక్టోబరు 25, 2024న సదరు అభియోగాలను వెనక్కితీసుకుంటూ ప్రిన్స్‌టన్ పోలీసులు డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసుకు లేఖ రాశారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.