POWERGRID Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో డిప్లోమా ట్రైనీల రిక్రూట్మెంట్
POWERGRID Recruitment 2023: డిప్లొమా ట్రైనీల రిక్రూట్మెంట్ కు ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 425 డిప్లొమా ట్రైనీ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.
POWERGRID Recruitment 2023: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 425 డిప్లొమా ట్రైనీ పోస్ట్ లకు నోటిఫికేషన్ వెలువడింది. వివిధ డిప్లొమా బ్రాంచ్ ల్లో ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు పవర్ గ్రిడ్ అధికారిక వెబ్ సైట్ www.powergrid.in. ను పరిశీలించండి.
ట్రెండింగ్ వార్తలు
లాస్ట్ డేట్..
పవర్ గ్రిడ్ లో డిప్లొమా ట్రైనీ పోస్ట్ లకు అప్లై చేయడానికిి ఆఖరు తేదీ సెప్టెంబర్ 23. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 23 లోగా ఆన్ లైన్ లో, పవర్ గ్రిడ్ అధికారిక వెబ్ సైట్ www.powergrid.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 425 డిప్లొమా ట్రైనీలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని పవర్ గ్రిడ్ నిర్ణయించింది. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 2022, సెప్టెంబర్ 30 నాటికి 27 సంవత్సరాలకు మించి ఉండరాదు.
అప్లికేషన్ ఫీజు
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 300లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆన్ లైన్ లో యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ విధానాల్లో దేని ద్వారా అయినా చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. ఈ పరీక్ష్ రెండు గంటల పాటు ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయి. ఈ పరీక్ష రెండు పార్ట్ లుగా ఉంటుంది. పార్ట్ 1 లో టెక్నికల్ నాలెడ్జ్ / ప్రొఫెషనల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. పార్ట్ 2 లో ఆప్టిట్యూడ్ నాలెడ్జ్, సూపర్వైజరీ స్కిల్స్ కు సంబంధించిన ప్రశ్నలుంటాయి.