పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగే తేదీ, సమయం ప్రకటించిన వాటికన్-pope francis funeral to take place on saturday says vatican ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగే తేదీ, సమయం ప్రకటించిన వాటికన్

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగే తేదీ, సమయం ప్రకటించిన వాటికన్

Sudarshan V HT Telugu

ఏప్రిల్ 21న కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ (88) అంత్యక్రియల వివరాలను వాటికన్ మంగళవారం వెల్లడించింది. డబుల్ న్యూమోనియాతో పోప్ ఫ్రాన్సిస్ (88) సోమవారం మరణించిన విషయం తెలిసిందే.

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల వివరాలు (AP)

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగే తేదీ, సమయం లను వాటికన్ మంగళవారం వెల్లడించింది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఏప్రిల్ 26 శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు సెయింట్ పీటర్స్ బాసిలికా లో జరుగుతాయని వాటికన్ ప్రకటించింది. అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయస్సులో సోమవారం మరణించారు. శనివారం, ఉదయం 10 గంటలకు పోప్ ఫ్రాన్సిస్ శవపేటికను చర్చిలోకి తీసుకెళ్లి, అక్కడి నుంచి శాంటా మారియా మాగియోర్ లోని రోమ్ సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించి మధ్యాహ్నం 1:30 గంటలకు ఖననం చేయనున్నారు.

ఈస్టర్ సోమవారం నాడు కన్నుమూత

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఏప్రిల్ 26 శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు జరుగుతాయని వాటికన్ ధృవీకరించింది. ఏప్రిల్ 21, ఈస్టర్ సోమవారం నాడు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఆయన బహిరంగ శవపేటిక చిత్రాలను వాటికన్ విడుదల చేసింది. ప్రపంచంలోని 140 కోట్ల మంది కాథలిక్కులకు అధిపతి అయిన పోప్ ఫ్రాన్సిస్ (88) సోమవారం వాటికన్ లోని తన నివాసంలో కన్నుమూశారు.

కార్డినల్ గియోవన్నీ బాటిస్టా రే అధ్యక్షత

సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో జరిగే అంత్యక్రియలకు కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ డీన్ కార్డినల్ గియోవన్నీ బాటిస్టా రే అధ్యక్షత వహిస్తారని వాటికన్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం, ఉదయం 10 గంటలకు పోప్ ఫ్రాన్సిస్ శవపేటికను చర్చిలోకి తీసుకెళ్లి, అక్కడి నుంచి శాంటా మారియా మాగియోర్ లోని రోమ్ బసిలికాకు తరలించి మధ్యాహ్నం 1:30 గంటలకు ఖననం చేయనున్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.