Imran Khan arrest : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు పోలీసులు యత్నం.. కనిపించని మాజీ ప్రధాని!
Imran Khan arrest : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. కానీ ఆయన అక్కడ కనిపించలేదు! అసలేం జరిగిందంటే..
Imran Khan arrest : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది! తాజాగా.. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. కానీ ఆయన అక్కడ కనిపించలేదు.
అరెస్ట్ ఎందుకు..?
ఇస్లామాబాద్‌లోని అధికారులు.. ఆదివారం మధ్యాహ్నం తర్వాత లాహోర్‌లోని ఇమ్రాన్ ఖాన్ నివాసానికి వెళ్లారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు సైతం అదే సమయంలో ఆయన నివాసం వద్దకు వెళ్లారు. పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Imran Khan Pakistan news : అనంతరం.. పోలీసుల బృందం.. ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి వెళ్లింది. కానీ ఆయన అక్కడ కనిపించ లేదు.
"లొంగిపోవడానికి ఇమ్రాన్ ఖాన్ అంగీకరించడం లేదు. కోర్టు నోటీసులతోనే పోలీసులు ఇమ్రాన్ ఖాన్ నివాసానికి వెళ్లాము. కానీ అక్కడ ఆయన కనిపించలేదు," అని ఇస్లామాబాద్ పోలీసుల బృందం పేర్కొంది.
Imran Khan latest news : విదేశాల నుంచి అందుకున్న బహుమతుల వివరాలను పాకిస్థాన్ అధికారులు ఎప్పటికప్పుడు బయటపెట్టాల్సి ఉంటుంది. కాగా.. తన హయాంలో అందుకున్న గిఫ్ట్‌లకు సంబంధించిన లెక్కల వివరాలను చెప్పడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలమైనట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటిని అమ్మేసి, ఆయన లబ్ధిపొందారన్నది ప్రధాన ఆరోపణ.
ప్రభుత్వంపై ఒత్తిడి..
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఈ ఏడాది అక్టోబర్ తర్వాత ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా.. మధ్యంతర ఎన్నికలు జరపాల్సిందిగా ప్రభుత్వంపై ఓవైపు ఇమ్రాన్ ఖాన్ ఒత్తిడి చేస్తుంటే, ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లడం చర్చలకు దారి తీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా.. తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ప్రభుత్వంలో ఉండగా.. వాటీని రద్దు చేశారు.
Imran Khan arrest latest updates : తాజా పరిస్థితులపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన వైస్ ఛైర్మన్ షా మెహ్మూద్ ఖురేషీ స్పందించారు. పోలీసుల నుంచి నోటీసులు అందాయని, కానీ అందులో అరెస్ట్ గురించి ఎలాంటి వివరాలు లేవని పేర్కొన్నారు. తమ న్యాయవాదుల బృందంతో చర్చించి, తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.