Delhi stampede : రైల్వే స్టేషన్​లో ​తొక్కిసలాటకు కారణం ఏంటి? దర్యాప్తులో బయటపడిన అసలు నిజాలు!-police reveals cause of new delhi railway station stampede ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Stampede : రైల్వే స్టేషన్​లో ​తొక్కిసలాటకు కారణం ఏంటి? దర్యాప్తులో బయటపడిన అసలు నిజాలు!

Delhi stampede : రైల్వే స్టేషన్​లో ​తొక్కిసలాటకు కారణం ఏంటి? దర్యాప్తులో బయటపడిన అసలు నిజాలు!

Sharath Chitturi HT Telugu
Published Feb 16, 2025 03:39 PM IST

New Delhi Railway Station stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు.

తొక్కిసలాట అనంతరం భయాందోళనల్లో ప్రయాణికులు..
తొక్కిసలాట అనంతరం భయాందోళనల్లో ప్రయాణికులు.. (Shrikant Singh)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యూదిల్లీ రైల్వే స్టేషన్​ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు. రైళ్ల అనౌన్స్​మెంట్​లో అనిశ్చితి వల్ల ఈ విషాదరకర ఘటన జరిగిందని దిల్లీ పోలీసులు తెలిపారు. పైగా.. ఆ సమయంలో ఉన్న రైళ్లకు "ప్రయాగ్​రాజ్"​ పేరు ఉండటంతో మహా కుంభమేళాకు వెళుతున్న యాత్రికుల్లో గందరగోళాన్ని సృష్టించిందని వివరించారు.

అనౌన్స్​మెంట్​తో అనిశ్చితి- ఆ తర్వాత తొక్కిసలాట!

మహా కుంభమేళా నేపథ్యంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్​ని పరిశీలించారు, అక్కడ ఉన్న అధికారులను విచారించారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తులోని పలు కీలక విషయాలను తాజాగా వెల్లడించారు.

“ప్రయాగ్​రాజ్​ స్పెషల్​ రైలు ప్లాట్​ఫామ్​ నెం.16కి వస్తోందని అనౌన్స్​మెంట్​ చేశారు. కానీ ఆ రైలు అప్పటికే ప్లాట్​ఫామ్​ నెం.14 మీద ఉంది. ప్రయాణికులు కన్ఫ్యూజ్​ అయ్యారు. ఇంకా ప్లాట్​ఫామ్​ నెం.14కి వెళ్లని వారందరు.. ప్లాట్​ఫామ్​ నెం.16లో రైలు ఉందనుకున్నారు. ఈ పరిణామాలతో గందరగోళం నెలకొంది. చివరికి న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగింది. ఇంకా చెప్పాలంటే.. ఆ సమయంలో ప్రయాగ్​రాజ్​కి వెళుతున్న రైళ్లు 4 ఉన్నాయి. వాటిల్లో 3 ఆలస్యంగా బయలుదేరాయి. ఫలితంగా ఒక్కసారిగా రద్దీ విపరీతంగా పెరిగిపోయింది,” దిల్లీ పోలీసులు వెల్లడించారు.

తొక్కిసలాట జరిగిన సమయంలో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో రైలు ప్లేస్​మెంట్ ఇలా ఉంది: ప్లాట్​ఫామ్​ 14 వద్ద ప్రయాగ్​రాజ్ ఎక్స్​ప్రెస్, ప్లాట్​ఫామ్​ 12 వద్ద మగధ్ ఎక్స్​ప్రెస్, ప్లాట్​ఫామ్​ 13 వద్ద స్వతంత్ర సేనాని ఎక్స్​ప్రెస్, ప్లాట్​ఫామ్​ 15 వద్ద భువనేశ్వర్ రాజధాని ఉన్నాయి. చివరి మూడు రైళ్లు కుంభమేళా మీదుగా ఆలస్యంగా నడుస్తున్నాయి.

మరోవైపు న్యూదిల్లీ రైల్వే స్టేషన్​ తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ప్రకటించారు.

తొక్కిసలాటకు రైల్వే యంత్రాంగం కారణమని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ విమర్శించారు.

“చివరి నిమిషంలో ప్లాట్​ఫామ్​ని మారుస్తామని ప్రకటించడం తొక్కిసలాటకు కారణమైంది. ప్రజలను నిలువరించే పరిపాలన లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 18 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యాలు కల్పించడానికి రైల్వేలను నిర్మించారు. కానీ ఇప్పుడు దానిని కేవలం సంపాదన సాధనంగా మారుస్తున్నారు,” అని ఆరోపించారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.