Child marriage : 72ఏళ్ల వృద్ధుడితో 12ఏళ్ల బాలిక పెళ్లి.. రూ. 1.5లక్షలకు కూతురిని అమ్మేసిన తండ్రి!-police rescue minor girl from forced marriage to 72 year old in pakistan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Child Marriage : 72ఏళ్ల వృద్ధుడితో 12ఏళ్ల బాలిక పెళ్లి.. రూ. 1.5లక్షలకు కూతురిని అమ్మేసిన తండ్రి!

Child marriage : 72ఏళ్ల వృద్ధుడితో 12ఏళ్ల బాలిక పెళ్లి.. రూ. 1.5లక్షలకు కూతురిని అమ్మేసిన తండ్రి!

Sharath Chitturi HT Telugu

Child marriage : చట్టాలు ఉన్నప్పటికీ.. పాకిస్థాన్​లో బాల్య వివాహాలను అడ్డుకోలేకపోతున్నారు. తాజాగా.. 72ఏళ్ల వృద్ధుడికి 12ఏళ్ల బాలికను పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి..

72ఏళ్ల వృద్ధుడితో 12ఏళ్ల బాలిక పెళ్లి..

Pakisthan child marriage cases : పాకిస్థాన్​లో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. ఓ వ్యక్తి.. తన కూతురిని రూ. 1.5 లక్షలకు అమ్మేశాడు! 72ఏళ్ల వృద్ధుడితో ఆ 12ఏళ్ల బాలిక పెళ్లి జరగడానికి కొంతసేపటి ముందు.. పోలీసులు వివాహాన్ని ఆపేశారు.

ఇదీ జరిగింది..

పాకిస్థాన్​లోని చార్​సద్దా పట్టణంలో జరిగింది ఈ ఘటన. మీడియా కథనా ప్రకారం.. అలామ్​ సయ్యెద్​.. తన 12ఏళ్ల కూతురిని 5,00,000 పీకేర్​ (సుమారు రూ. 1.5లక్షలు)కు ఓ వృద్ధుడికి అమ్మేశాడు. ఆ వృద్ధుడి పేరు హబీబ్​ ఖాన్​. నిఖా జరగడానికి సరిగ్గా కొంతసేపటి ముందు.. పోలీసులు అక్కడికి వెళ్లారు. బాలికను రక్షించారు. 72ఏళ్ల వయస్సులో పెళ్లికి రెడీ అయిన హబీబ్​ ఖాన్​ని, మరికొందరిని అరెస్ట్​ చేశారు. కానీ బాలిక తండ్రి అలామ్​ సయ్యెద్​.. అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

72ఏళ్ల వృద్ధుడు, బాలిక తండ్రిపై బాల్య వివాహ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:- AP Inter Results 2024 : బాల్య వివాహం నుంచి బయటపడి, ఇంటర్ లో టాపర్‌గా నిలిచి..! ఈ కర్నూలు విద్యార్థిని స్టోరీ చదవాల్సిందే

Child marriage in pakistan : పాకిస్థాన్​లో.. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు ఉన్నాయి! కానీ అవి పెద్దగా ఫలితాల్ని ఇవ్వడం లేదు. ఆ దేశంలో నిత్యం ఏదో ఒక చోట.. బాల్య వివాహాలకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే.. రంజన్​పూర్​, థట్ట ప్రాంతాల్లో జరగాల్సిన బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కూడా.. పెద్ద వయస్సు వారితో బాలికల పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. రంజన్​పూర్​లో.. 40ఏళ్ల వ్యక్తికి, 11ఏళ్ల మైనర్​ని పెళ్లి చేసేందుకు చూశారు. థట్టలో.. 50ఏళ్ల వ్యక్తికి, మైనర్​తో పెళ్లి జరిపించేందుకు సిద్ధపడ్డారు. కానీ చివరి నిమిషంలో పోలీసులు అడ్డుకున్నారు.

మే 6న.. ఓ 70ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. స్వాత్​ అనే ప్రాంతంలో.. ఓ 13ఏళ్ల బాలికను ఆయన పెళ్లి చేసుకోవడం ఇందుకు కారణం. వృద్ధుడితో పాటు బాలిక తండ్రిని కూడా అరెస్ట్​ చేశారు. పెళ్లిలో పాల్గొన్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Child marriage in pakistan 2024 : ఇలా.. బాల్య వివాహాలకు చాలా కారణాలు ఉంటాయి. కొందరు సంప్రదాయం పేరుతో.. బాలికలకు పెళ్లి చేస్తూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో.. పేదరికం ఒక ప్రధాన కారణం అవుతుంది. బిడ్డ పెళ్లికి డబ్బులు లేక, భయంతో తల్లిదండ్రులు ఇలా వృద్ధులకు పెళ్లి చేస్తూ ఉంటారు. వారి ఇచ్చే డబ్బులకు ఆశపడి.. బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు.

పలు రిపోర్టుల ప్రకారం.. పాకిస్థాన్​లోని 18శాతం బాలికలకు.. 18ఏళ్లు నిండకుండానే పెళ్లి జరుగుతోంది. 4.7శాతం మంది అబ్బాయిలకు కూడా 18ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేసేస్తున్నారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.