PNB Recruitment 2023 : పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​​లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్​ వివరాలివే-pnb recruitment 2023 see full notification details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pnb Recruitment 2023 : పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​​లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్​ వివరాలివే

PNB Recruitment 2023 : పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​​లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్​ వివరాలివే

Sharath Chitturi HT Telugu
May 29, 2023 12:16 PM IST

PNB Recruitment 2023 : 200కుపైగా పోస్టుల కోసం నోటిఫికేషన్​ను విడుదల చేసింది పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​. నోటిఫికేషన్​లోని పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​​లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్​ వివరాలివే
పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​​లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్​ వివరాలివే (MINT_PRINT)

PNB Recruitment 2023 : దేశవ్యాప్తంగా ఉన్న అనేక బ్యాంక్​లు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఈ జాబితాలోకి పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ (పీఎన్​బీ) కూడా చేరింది. మేనేజర్​తో పాటు మొత్తం మీద 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది ఈ బ్యాంక్​. అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అప్లికేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువు జూన్​ 11. ఈ నేపథ్యంలో బ్యాంక్​ నుంచి వచ్చిన నోటిఫికేషన్​కు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2023..

వేకెన్సీ వివరాలు:-

  • మొత్తం పోస్టులు- 240
  • మేనేజర్​ పోస్టులు- 11
  • ఆఫీసర్​- 224
  • సీనియర్​ మేనేజర్​- 5

విద్యార్హత:-

Punjab National Bank recruitment apply online : ఈ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​లో పాల్గొనాలని భావిస్తున్న అభ్యర్థులు డిగ్రీ, పీజీ, సీఏ, సీఎంఏ, సీఎఫ్​ఏలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు పరిమితి:-

ఆఫీసర్​- 21-30ఏళ్లు

మేనేజర్​- 25-35ఏళ్లు

సీనియర్​ మేనేజర్​- 27-38ఏళ్లు

ముఖ్య తేదీలు..

ఆన్​లైన్​ అప్లికేషన్​ మొదలైన తేదీ- 24 మే

ఆన్​లైన్​ అప్లికేషన్​ తుది గడువు- 11 మే

పరీక్ష జరిగే తేది- జులై 2

అప్లికేషన్​ ఫీజు..

ఎస్​సీ/ ఎస్​టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.59

ఇతరులకు రూ. 1,180

పూర్తి నోటిఫికేషన్​ను చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆన్​లైన్​ అప్లికేషన్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్​బీఐ రిక్రూట్​మెంట్​ 2023..

స్పెషలిస్ట్​ క్యాడర్​ ఆఫీర్స్​కు చెందిన వివిధ రెగ్యూలర్​, కాంట్రాక్ట్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. డేటా, టెక్​, టెస్టింగ్​తో పాటు ఇతర విభాగాల్లోని అసిస్టెంట్​ జనరల్​ మేనేజర్​, చీఫ్​ మేనేజర్​, ప్రాజెక్ట్​ మేనేజర్​ వంటి పోస్టులను ఈ దఫా రిక్రూట్​మెంట్​లో భర్తీ చేయనుంది ఎస్​బీఐ. ఈ మేరకు అప్లికేషన్​ ప్రక్రియ ఈ నెల 16నే మొదలైపోయింది. జూన్​ 5తో అప్లికేషన్​ గడువు ముగుస్తుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను bank.sbi/careers లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐడీబీఐ బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2023..

ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్​ను విడుదల చేసింది ఐడీబీఐ బ్యాంక్​ (ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా). అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జూన్​ 7తో అప్లికేషన్​ ప్రక్రియ ముగియనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం