Sonia Gandhi birthday: ‘‘ఆయురారోగ్యాలతో..’’ - సోనియా గాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
Sonia Gandhi birthday: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బర్త్ డే సందర్భంగా ఆమెకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Sonia Gandhi birthday: డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 77వ బర్త్ డే. ఆమె జన్మదినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆయురారోగ్యాలతో..
సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రధాని మోదీ (PM Modi) ఆకాంక్షించారు. సోనియా గాంధీ బర్త్ డే (Sonia Gandhi birthday) సందర్భంగా మోదీ ఆమెకు ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ చిరకాలం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, జన్మదినం సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇతర నాయకులు..
ప్రధాని మోదీతో పాటు పలువురు ఇతర నాయకులు సోనియాగాంధీకి బర్త్ డే విషెస్ చెప్పారు. వారిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, శశి థరూర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తదితరులు ఉన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం సోనియా గాంధీ ఎడతెగని పోరాటం చేస్తున్నారని ఖర్గే అన్నారు. ఆమె చిరకాలం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. సోనియా గాంధీ జీవన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకమని కేసీ వేణు గోపాల్ ప్రశంసించారు. అత్యంత సవాళ్లతో కూడిన కాలంలో కాంగ్రెస్‌ను గొప్ప సమన్వయంతో ఆమె నడిపించారన్నారు.