New metro line in Bengaluru: కొత్త మెట్రో లైన్ ప్రారంభించనున్న ప్రధాని-pm modi to inaugurate new metro line in bengaluru today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pm Modi To Inaugurate New Metro Line In Bengaluru Today

New metro line in Bengaluru: కొత్త మెట్రో లైన్ ప్రారంభించనున్న ప్రధాని

HT Telugu Desk HT Telugu
Mar 25, 2023 07:40 AM IST

బెంగళూరు మెట్రో ఫేజ్ 2లో భాగంగా కొత్త మెట్రో లైన్‌ను ప్రధాన మంత్రి నేడు ప్రారంభించనున్నారు.

నేడు కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని
నేడు కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని (AP)

బెంగళూరు: అర్బన్ మొబిలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వృద్ధిలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం బెంగళూరు మెట్రో ఫేజ్ 2 లో కొత్త లైన్ ప్రారంభించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం కర్ణాటకలో ప్రధాని పర్యటించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

‘నేను మార్చి 25న కర్ణాటకలో ఉంటాను. చిక్కబళ్లాపూర్‌లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ప్రారంభిస్తాను. ఆ తర్వాత బెంగళూరు మెట్రోలోని వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపుర మెట్రో లైన్‌ను ప్రారంభించేందుకు బెంగళూరుకు వెళతాను..’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఈ ప్రాంతంలో విద్యార్థులు కొత్త అవకాశాలను పొందేందుకు, అందుబాటులో వైద్య సేవలు పొందేందుకు ప్రధాన మంత్రి చిక్కబళ్లాపూర్‌లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ని ప్రారంభిస్తారు.

ఈ సంస్థను శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ నెలకొల్పింది. చిక్కబళ్లాపూర్‌లోని సత్యసాయి గ్రామంలో దీనిని స్థాపించారు. వైద్య విద్య, నాణ్యమైన వైద్య సంరక్షణను ఉచితంగా అందిస్తుంది. 2023 విద్యా సంవత్సరం నుండి ఇన్‌స్టిట్యూట్ పనిచేయడం ప్రారంభమవుతుంది.

బెంగళూరు మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా వైట్‌ఫీల్డ్ (కడుగోడి) మెట్రో నుండి కృష్ణరాజపుర మెట్రో లైన్ వరకు 13.71 కి.మీ. విస్తరించారు. వైట్‌ఫీల్డ్ మెట్రో స్టేషన్‌లో ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారు.

దాదాపు రూ. 4,250 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మెట్రో లైన్ ప్రారంభోత్సవం బెంగళూరులోని ప్రయాణికులకు పరిశుభ్రమైన, సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.

IPL_Entry_Point