PM Modi's 'peace talks' offer: ఉక్రెయిన్ అధ్యక్షుడికి మోదీ కీలక ప్రతిపాదన-pm modi s peace talks offer as he speaks with ukraine s zelensky ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pm Modi's 'Peace Talks' Offer As He Speaks With Ukraine's Zelensky

PM Modi's 'peace talks' offer: ఉక్రెయిన్ అధ్యక్షుడికి మోదీ కీలక ప్రతిపాదన

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 09:56 PM IST

PM Modi's 'peace talks' offer: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రమవుతోంది. పశ్చిమ దేశాల మద్ధతుతో ఉక్రెయిన్ రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఫోన్ కాల్ కీలకంగా మారింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi's 'peace talks' offer: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నుంచి అణు దాడి భయం పెరుగుతున్ననేపథ్యంలో.. భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కి మంగళవారం ఫోన్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

PM Modi's 'peace talks' offer: శాంతి ప్రతిపాదన..

యుద్ధం అనే సమస్యకు ఏనాడు కూడా మిలటరీ విధానంలో పరిష్కారం సాధ్యం కాదని ప్రధాని మోదీ తెలిపారు. రష్యాతో యుద్ధాన్ని నిలిపివేసి, శాంతి నెలకొల్పే దిశగా జరిగే ప్రయత్నాలకు తన వంతు సహకారం అందించడానికి భారత్ సదా సిద్ధంగా ఉంటుందని జెలెన్ స్కీ కి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా ఈ సంక్షోభం ముగియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా, దౌత్య మార్గాల ద్వారా శాంతి కోసం ప్రయత్నించాలని సూచించారు.

PM Modi's 'peace talks' offer: అణు స్థావరాలు..

యుద్ధ పరిస్థితుల్లో దేశంలోని అణు కేంద్రాలను సురక్షితంగా కాపాడుకోవడం చాలా అవసరమని మోదీ వక్కాణించారు. అణు స్థావరాలు ధ్వంసమైతే జరిగే విపరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా దారుణంగా ఉంటాయన్నారు.

PM Modi's 'peace talks' offer: సార్వభౌమత్వ పరిరక్షణ

యూఎన్ నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలను రష్యా గౌరవించడం లేదని, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే బాధ్యత తనపై ఉందని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.

IPL_Entry_Point