Gaganyaan astronauts : 'గగన్​యాన్​​'లో పర్యటించే వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోదీ!-pm modi reveals names of astronauts picked for gaganyaan mission at isro centre ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gaganyaan Astronauts : 'గగన్​యాన్​​'లో పర్యటించే వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోదీ!

Gaganyaan astronauts : 'గగన్​యాన్​​'లో పర్యటించే వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోదీ!

Sharath Chitturi HT Telugu
Updated Feb 27, 2024 01:35 PM IST

Gaganyaan astronauts names : గగన్యాన్​ మిషన్ కోసం సన్నద్ధమవుతున్న నలుగురు వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేశారు ప్రధాని మోదీ. 140 కోట్ల భారతీయుల అంతరిక్ష ఆంకాక్షలను వారు మోస్తున్నారని వ్యాఖ్యానించారు.

'గగన్​యాన్​​'లో పర్యటించే వ్యోమగాముల పేర్లును ప్రకటించి మోదీ!
'గగన్​యాన్​​'లో పర్యటించే వ్యోమగాముల పేర్లును ప్రకటించి మోదీ!

Who are the astronauts selected for Gaganyaan : ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గగన్​యాన్​' మిషన్​కి సంబంధించిన కీలక్​ అప్టేట్​! భారత దేశ తొలి మానవసహిత అంతరిక్ష మిషన్​లో ప్రయాణించే నలుగురు వ్యోమగాముల పేర్లను మంగళవారం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారు.. గ్రూప్​ కెప్టెన్​ పీ బాలకృష్ణన్​ నాయర్​, గ్రూప్​ కెప్టెన్​ అజిత్​ కృష్ణన్​, గ్రూప్​ కెప్టెన్​ అంగద్​ ప్రతాప్​, వింగ్​ కమాండర్​ ఎస్​ శుక్లా. వీరందరికి.. 'అస్ట్రోనాట్​ వింగ్స్​'ని ఇచ్చారు మోదీ.

గగన్​యాన్​ మిషన్​కు ఇస్రో సన్నద్ధం..

కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. తిరువనంతపురంలోని వీఎస్​ఎస్​సీ (విక్రమ్​ సారాభాయ్​ స్పేస్​ సెంటర్​)ని సందర్శించారు. గగన్​యాన్​ మిషన్​ ప్రోగ్రెస్​ని రివ్యూ చేశారు. అనంతరం.. మిషన్​ కోసం సన్నద్ధమవుతున్న వ్యోమగాములను కలిశారు. ఆ తర్వాత.. వారందరిని ప్రపంచానికి పరిచయం చేశారు.

Gaganyaan 3 astronauts name : 2024-25 మధ్యలో ఈ గగన్​యాన్​ మిషన్​ని ప్రయోగించాలని ఇస్రో ప్లాన్​ చేసింది. అంతరిక్షణంలో లో ఎర్త్​ ఆర్బిట్​లో మూడు రోజుల పాటు వ్యోమగాములను ఉంచి, వారిని సురక్షితంగా ఇండియాకు తీసుకురావడమే ఈ మిషన్​ లక్ష్యం. మిషన్​ కోసం వ్యోమగాములు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. టెక్నికల్​ స్కిల్స్​తో పాటు ఫిజికల్​ ఫిట్​నెస్​పై అధిక దృష్టిపెట్టారు.

"గగన్​యాన్​లో ప్రయాణించే నలుగురి పేర్లు ఇప్పుడు ఇండియాకు తెలిసింది. ఈ నలుగురు కేవలం ప్రయాణికులు మాత్రమే కారు! 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకు వెళ్లే శక్తులు.. ఈ నలుగురు. 40ఏళ్ల తర్వాత.. ఓ భారతీయులు స్పేస్​లోకి వెళుతున్నారు. కానీ ఈసారి.. కౌంట్​డౌన్​ మనది, రాకెట్​ మనది," అని మోదీ అన్నారు.

Gaganyaan mission launch date : 1988లో సోవియట్​ యూనియన్​ తరఫును.. వింగ్​ కమాండర్​ రాకేశ్​ శర్మ (రిటైర్డ్​).. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

"ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతున్న సమయంలో.. గగన్​యాన్​ మిషన్​ జరుగుతుండటం.. అంతరిక్షణ రంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది," అని మోదీ అభిప్రాయపడ్డారు.

Gaganyaan mission astronauts : అంతర్జాతీయ ఏజెన్సీల వద్ద ఉన్న కటింగ్​ ఎడ్జ్​ టెక్నాలజీతో పాటు భారత దేశంలోని నిపుణులు, పరిశ్రమ ఎక్స్​పీరియెన్స్​, అకాడమియా సామర్థ్యాలు, పరిశోధనా సంస్థల నైపుణ్యాలను వినియోగించుకుంటూ.. గగన్​యాన్​ కోసం ముందుకు వెళుతోంది ఇస్రో.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.