PM Modi podcast : ప్రధాని మోదీ తొలి పాడ్‌క్యాస్ట్.. నిఖిల్ కామత్‌తో రాజకీయలపై చర్చ..
PM Modi podcast with Nikhil Kamath : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “పాడ్‌కాస్ట్” ప్రపంచంలోకి అడుగుపెట్టారు. జెరోధా సీఈఓ నిఖిల్ కామత్ హోస్ట్‌గా నిర్వహించే షోలో ఆయన పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇప్పటివరకు మన్-కీ-బాత్‌తో రెడీయోలో తన గొంతుకను వినిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి.. యూట్యూబ్ పాడ్‌కాస్ట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు! జెరోధా సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ పాడ్‌కాస్టర్ నిఖిల్ కామత్ నిర్వహించే 'పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్' అనే పాడ్‌కాస్ట్‌లో మోదీ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన 'పీపుల్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎపిసోడ్ 6 ట్రైలర్" సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విడుదలైన 11 గంటల్లోనే.. ఈ 2 నిమిషాల వీడియోకి 7లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.
పాడ్కాస్ట్లోకి మోదీ ఎంట్రీ..
తాజాగా విడుదలైన పాడ్‌కాస్ట్ ట్రైలర్లో నిఖిల్ కామత్, ప్రధాని నరేంద్ర మోదీ తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు. "నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. నాకు కంగారుగా ఉంది. ఇది నాకు కఠినమైన సంభాషణ," అని కామత్ హిందీ భాషలో వీడియోలో చెప్పారు. 'ఇది నా తొలి పాడ్‌కాస్ట్. పతా నహీ కైసా జాయేగా (ఎలా జరుగుతుందో)," అని ప్రధాని బదులివ్వడంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇక్కడ చూడండి
పీఎం నరేంద్ర మోదీతో నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్..
"పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" పాడ్‌కాస్ట్ ఆరొవ ఎపిసోడ్ కోసం తన విజన్‌ని పంచుకున్నారు నిఖిల్ కామత్. ప్రధాని మోదీతో సంభాషణ సమయంలో రాజకీయాలు, వ్యవస్థాపకత మధ్య సారూప్యతలను గీయాలనుకుంటున్నానని చెప్పారు.
తన హిందీని క్షమించాలని నిఖిల్ కామత్ ప్రధాని మోదీని కోరారు.
'హమ్ దోనో కీ ఐసే హి చలేగీ' అని ప్రధాని ఆయనకు భరోసా ఇచ్చారు.
రాజకీయాలపై : రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ప్రధాని మోదీ ఎలాంటి సలహాలు ఇస్తారని? నిఖిల్ కామత్ అడిగారు. మంచి వ్యక్తులు రాజకీయ నాయకులు కావాలని సూచించారు. వారు కేవలం ఆశయంతో కాకుండా ఒక మిషన్‌తో రావాలని ప్రధాని మోదీ అన్నారు.
మోదీ, గుజరాత్ సీఎం : గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ చేసిన పాత ప్రసంగాల్లో ఒకదాని గురించి నిఖిల్ కామత్ మాట్లాడారు. "నేను సున్నితంగా ఏదో చెప్పాను. పొరపాట్లు జరుగుతాయి. మనుష్య హు, దేవత తోడి హూం (నేను మనిషిని, దేవుడు కాదు)," అని మోదీ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల గురించి కూడా ఇద్దరూ చర్చించారు. 'ఆజ్ పూరీ దునియా వార్ కీ తరాఫ్ చల్ రహీ హై (నేడు ప్రపంచం యుద్ధం వైపు కదులుతోంది). లోకంలో ఏం జరుగుతోందో అని మనం ఆందోళన చెందాలా? అని కామత్ ప్రధాని మోదీని ప్రశ్నించారు.
దీనికి ప్రధాని సమాధానమిస్తూ.. 'క్రైసిస్ కే సమయ్ హుమ్నీన్ లగతార్ కహాన్ హై కీ హమ్ న్యూట్రల్ నహీ హై. మెయిన్ శాంతి కే పక్ష్ మే హూం". (సంక్షోభ సమయంలో మేం తటస్థంగా లేమని ఎప్పటికప్పుడు చెబుతునే ఉన్నాను. నేను శాంతికి అనుకూలం)
ప్రధానిగా మోదీ మొదటి టర్మ్, రెండో టర్మ్ ఎలా భిన్నంగా ఉందని నిఖిల్ కామత్ ప్రశ్నించారు.
దీనికి ప్రధాని మోదీ సమాధానమిస్తూ,'పెహ్లీ పదం మే తో లోగ్ ముజే భీ సమాజ్నే కి కోషిష్ కార్తే, ఔర్ మెయిన్ భీ దిల్లీ కో సమజ్నే కీ కోషిష్ కర్తా థా' అని వ్యాఖ్యానించారు. (నా మొదటి పదవీకాలంలో, భారతీయ ప్రజలు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. నేను దిల్లీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.)
ఈ పాడ్కాస్ట్పై టీజర్ అంచనాలను పెంచేసింది. ఈ పాడ్‌కాస్ట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు కానీ "కమింగ్ సూన్" అని టీజర్ చివరిలో ఉంది.
సంబంధిత కథనం