Vande Bharat express : దక్షిణాది తొలి 'వందే భారత్'​ ఎక్స్​ప్రెస్​.. ప్రారంభించిన మోదీ-pm modi launches first vande bharat semi fast train of south india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pm Modi Launches First 'Vande Bharat' Semi-fast Train Of South India

Vande Bharat express : దక్షిణాది తొలి 'వందే భారత్'​ ఎక్స్​ప్రెస్​.. ప్రారంభించిన మోదీ

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 11, 2022 10:29 AM IST

South India Vande Bharat express : బెంగళూరులో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దక్షిణాది తొలి భారత్​ వందే ఎక్స్​ప్రెస్​ను ప్రారంభించారు. అనంతరం భారత్​ గౌరవ్​ కాశీ దర్శన్​ రైలుకు కూడా పచ్చ జెండా ఊపారు.

Vande Bharat Express is India's first semi-high speed train. (HT PHOTO)
Vande Bharat Express is India's first semi-high speed train. (HT PHOTO) (HT_PRINT)

Vande Bharat express South India : దక్షిణాది తొలి 'వందే భారత్​' ఎక్స్​ప్రెస్​ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేఎస్​ఆర్​ బెంగళూరు రైల్వే స్టేషన్​లో పచ్చ జెండా ఊపి, ఈ సెమీ హై స్పీడ్​ ఎక్స్​ప్రెస్​ను మొదలుపెట్టారు ప్రధాని.

ట్రెండింగ్ వార్తలు

ఆ తర్వాత.. ‘భారత్​ గౌరవ్​ కాశీ దర్శన్​’ రైలును కూడా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

అంతకు ముందు.. బెంగళూరు విధాన సౌధకు వెళ్లిన మోదీ.. ప్రముఖ కవి కనకదాస, మహర్షి వాల్మీకి విగ్రహాలకు నివాళులర్పించారు. వారి చరిత్రలను స్మరించుకున్నారు.

దక్షిణాది తొలి వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ విశేషాలు..

ఈ వందే భారత్​ ఎక్స్​ప్రెస్..​ మైసూరు నుంచి చెన్నై మధ్య ప్రయాణిస్తుంది. మొత్తం మీద 500కి.మీలను 6 గంటల 30నిమిషాల్లో చుట్టేస్తుంది. కేవలం రెండు స్టాప్​లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. అవి.. కట్పాడి, బెంగళూరు.

పూర్తి సామర్థ్యంతో నడిస్తే.. ఈ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​.. చెన్నై నుంచి బెంగళూరుకు కేవలం 3 గంటల్లో చేరుకోగలుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Vande Bharat express Chennai to Mysore : దక్షిణాది తొలి వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ సాధారణ కార్యకలాపాలు శనివారం ప్రారంభమవుతాయి.

చెన్నై నుంచి మైసూరుకు వెళ్లే ప్రయాణికుల టికెట్​ ధర కార్​ చైర్​లో అయితే రూ. 1,200గా, ఎగ్జిక్యూటివ్​ క్లాస్​ అయితే రూ. 2,295గా ఉంది. మైసూరు నుంచి చెన్నైకు వెళ్లే ప్రయాణికుల టికెట్​ ధర.. రూ. 1,365- రూ. 2,486గా ఉంది.

చెన్నైలోని ఐసీఎఫ్​(ఇంటిగ్రల్​ కోచ్​ ఫ్యాక్టరీ)లో ఈ రైలును అభివృద్ధి చేశారు. ఇంటెలిజెంట్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ని ఇందులో ఏర్పాటు చేశారు.

అన్ని బోగీలకు ఆటోమెటిక్​ డోర్లు, జీపీఎస్​ ఆధారిత ఆడియో విజువల్​ ప్యాసింజర్​ ఇన్​ఫర్మేషన్​ సిస్టెమ్​, ఆన్​బోర్డ్​ వైఫ్​ హాట్​స్పాట్​తో పాటు సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి.

భారత దేశ తొలి వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. ఢిల్లీ- కాన్పూర్​- అలహాబాద్​- వారణాసి రూట్​లో ఇది ప్రయాణిస్తుంది.

ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పలు వందే భారత్​ ఎక్స్​ప్రెస్​లను ప్రారంభించారు మోదీ. కాగా.. వివిధ యాక్సిడెంట్లతో అవి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా పశువులను రైలు ఢీకొడుతున్న ఘటనలు ఆందోళనకరంగా మారాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం