Aero India 2023 : ఏరో ఇండియా 14వ ఎడిషన్‌ను ప్రారంభించిన మోదీ
Bengaluru Aero India 2023 : ఏరో ఇండియా 2023ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఐదు రోజుల పాటు ఈ ఈవెంట్ జరగనుంది.
Aero India 2023 inuaguration : బెంగళూరు వేదికగా.. ఏరో ఇండియా 2023 ఈవెంట్‌ను సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశీయంగా రూపొందించిన పరికరాలు, టెక్నాలజీతో పాటు ప్రపంచ దేశాలతో భారత్‌కు ఉన్న భాగస్వామ్యాన్ని చాటిచెప్పే విధంగా ఈ ఈవెంట్లో ప్రదర్శనలు ఉండనున్నాయి.
ఈ నేపథ్యంలో నవ భారత శక్తి గురించి మాట్లాడారు మోదీ.
"నవ భారత సామర్థ్యాలకు బెంగళూరు సాక్ష్యంగా నిలుస్తోంది. నవ భారతానికి ఆకాశమే హద్దు అని రుజువవుతోంది. ఈ రోజున.. మన దేశం నూతన శిఖరాలను అందుకోవడంతో పాటు దాటుకుని ముందుకు పరుగులు తీస్తోంది. డిఫెన్స్ కంపెనీలకు మార్కెట్‌గా ఈరోజున ఇండియా ఉంది. రక్షణ భాగస్వామ్యం అంశంలో భారత్‌కు ఎంతో శక్తి ఉంది. ఎయిరో ఇండియా అనేది నవ భారత విధానాలకు చిహ్నం. ఒకప్పుడు ఇది కేవలం ఒక షోగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈరోజున ఇది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు. ఇది భారతదేశ శక్తిని చాటిచెప్పే వేదిక," అని అన్నారు మోదీ.
ఏరో ఇండియా 2023 నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షెల్ వీఆర్ చౌదరి.. గురుకుల్ ఫార్మేషన్కు నాయకత్వం వహించారు. ఆకాశంలో విమానాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
Aero India 2023 schedule : ఏరో ఇండియా ఈవెంట్.. 5 రోజుల పాటు జరగనుంది. ఇది 14వ ఎడిషన్ ఈసారి "ది రన్‌వే టు ఎ బిలియన్ ఆపర్చ్యునిటీస్" అనే థీమ్‌ను ఎంపిక చేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
దేశీయ ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు.. అంతర్జాతీయ సప్లై- చెయిన్ వ్యవస్థ మధ్య బంధాన్ని ధృఢపరిచేందుకు ఈ ఏరో ఇండియా 2023 ఉపయోగపడనుంది. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, వివిధ ప్రొడక్టులను కలిసి రూపొందించడంలో భాగస్వామ్యం ఏర్పరచకునేందుకు ఈ ఈవెంట్ పనికొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
80 దేశాలు.. 800కుపైగా సంస్థలు..
Aero India 2023 News Live Updates : ఈ ఈవెంట్లో 80కిపైగా దేశాలు పాల్గొంటున్నాయి. 30 దేశాల మంత్రులు, 65 అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో పాటు ఇండియన్ ఓఈఎమ్ (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మేన్యుఫ్యాక్చరర్)లు సైతం ఏరో ఇండియా 14వ ఎడిషన్‌కు హాజరవుతారు. డిఫెన్స్ విభాగంలోని 800కుపైగా కంపెనీలు ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. వీటిల్లో 100 విదేశీ కంపెనీలు, 700 దేశీయ సంస్థలు ఉన్నాయి.
ఎయిర్‌బస్, బోయింగ్, డసాల్ట్ ఏవియేషన్, లాక్‌హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, బ్రహ్మోస్ ఎయిరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సీ రోబోటిక్స్, ఎస్ఏఏబీ, సాఫ్రాన్, రోల్స్ రాయిస్, లార్సన్ అండ్ టుబ్రో, భారత్ ఫోర్జ్, హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్, బీఈఎల్, బీడీఎల్ వంటి సంస్థలు ప్రదర్శనలు చేయనున్నాయి.
Aero India 2023 live : డిఫెన్స్, ఎయిరోస్పేస్‌లో ఆత్మనిర్భరత సాధించే దిశగా ప్రధాని మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ ఏరో ఇండియా 2023 ఈవెంట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.