PM Modi attends official events hours after mother cremation: తల్లి హీరాబెన్ అంత్యక్రియల్లో పాల్గొన్న కొన్ని గంటల్లోనే ప్రధాని మోదీ అధికారిక విధుల్లో పాల్గొని కర్మ యోగిగా నిలిచారు. షెడ్యూల్డ్ ప్రకారం ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం పశ్చిమ బెంగాల్ పర్యటించాల్సి ఉంది. కానీ మాతృమూర్తి మరణంతో గుజరాత్ లోని అహ్మదాబాద్ వెళ్లి, అంత్యక్రియల్లో పాల్గొనాల్సి రావడంతో ఆయన బెంగాల్ పర్యటన రద్దు అయింది.
తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తయిన కాసేపటికే ప్రధాని మోదీ(PM Modi) అధికారిక విధుల్లో పాల్గొనడం ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ పర్యటన రద్దు కావడంతో, అక్కడ జరిగిన కార్యక్రమాల్లో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఏడవ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించారు. పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
మాతృమూర్తి మరణంతో విషాదంలో ఉన్న ప్రధాని మోదీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బెంగాల్ లో జరగాల్సిన కార్యక్రమంలో మీరు లేకపోవడం బాధాకరమే అయినా, తల్లి అంత్యక్రియల్లో పాల్గొని, బాధలో ఉన్న మీరు ఈ రోజు విశ్రాంతి తీసుకోండి’’ అంటూ హౌరాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మమత ప్రధానికి సందేశమిచ్చారు. అదే కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ‘ప్రియమైన ప్రధాని గారు, ఈ రోజు చాలా బాధాకరమైన రోజు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని మమత (Mamata Banerjee) పేర్కొన్నారు.
మమత ప్రసంగం అనంతరం వందే భారత్ ఎక్స్ ప్రెస్(vande bharat express) ట్రైన్ ను ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించారు. అనంతరం నాలుగు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వయంగా రాాలేకపోయినందుకు బెంగాల్ ప్రజలు క్షమించాలని కోరారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్షంగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయానని వివరించారు.