Planet Parade : అకాశంలో మహాద్భుతం- ఈరోజు నుంచే ‘ప్లానెట్ పరేడ్’, ఇలా చూసేయండి..
Planet Parade 2025 India : ఆకాశంలో అద్భుతానికి సమయం ఆసన్నమైంది! ఈ రోజు నుంచి 6 గ్రహాలు ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. ఇవి కళ్లకు కనిపిస్తాయా? వీటిని ఎలా చూడాలి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అకాశంలో మహాద్భుతం! ఈ రోజు నుంచే ‘ప్లానెట్ పరేడ్ 2025’.. ఆకాశంలో కనువిందు చేయనుంది. వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వంటి ఆరు గ్రహాలు ఒకే చోటకు చేరనున్నాయి. ఫిబ్రవరి చివరి వరకు ఈ గ్రహాలు ఇలాగే ఉంటాయి. అంతేకాదు, ఫిబ్రవరి చివరిలో మెర్క్యూరీ సైతం ఈ గ్రహాల సరసన చేరుతుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్12 వరకు బుధుడు ఏడు గ్రహాల విశ్వ ప్రదర్శనను పూర్తి చేస్తాడు.
ప్లానెట్ పరేడ్ 2025..
వాస్తవానికి గ్రహాలు అన్నీ పర్ఫెక్ట్ లైన్లో కనిపించవు, కానీ ఇవి మన సౌర మండల ఆర్బిటల్ ప్లేన్‌ని అనుసరిస్తాయి. ఈ అరుదైన ఘట్టాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతటా ఖగోళ బృందాలు ప్లానెట్ పరేడ్ 2025 కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్లానెటరీ అబ్జర్వేషన్ సెషన్లను ప్లాన్ చేశాయి. వీటితో కేవలం గ్రహాలను చూడటమే కాదు, గెలాక్సీలు, నెబ్యులాలు (నక్షత్రాల మధ్య కనిపించే అంతరిక్షంలో ధూళి, వాయువు భారీ మేఘాలు) వంటి లోతైన-అంతరిక్ష అద్భుతాలను కూడా ఎక్స్‌పీరియెన్స్ చేయవచ్చు. గురుగ్రామ్, ముంబై, డెహ్రాడూన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ తరహా సెషన్స్ కోసం బుకింగ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇందులో అంత ప్రత్యేకత ఏముంది?
ఆరు గ్రహాలు, వాటిలో నాలుగు ప్రత్యక్షంగా కళ్లకు కనిపించడం మరో ప్రత్యేకత. దీనిని ప్లానెట్ పరేడ్ అని పిలుస్తున్నా, ఇది టెక్నికల్ ట్మర్మ్ కాదు. వాస్తవానికి గ్రహాల లైనప్ అవ్వడం తరుచుగా జరిగే ప్రక్రియే. కానీ ఆరు గ్రహాలు ఒకేసారి కనిపించడం ఇక్కడి ప్రత్యేకత! అందుకే ఈసారి ప్లానెట్ పరేడ్ మరింత ఆకర్షణీయంగా మారింది.
ఎలా చూడాలి..?
ఈ ఖగోళ ప్రదర్శనను వీక్షించడానికి ఉత్తమ సమయం.. సూర్యాస్తమయం తర్వాత ఒక గంట అని పీహెచ్డీ చేసిన మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ అనూప్ సింగ్ చెప్పారు. స్మార్ట్‌ఫోన్ కెమెరాతో ఆ దృశ్యాలను బంధించాలనుకునేవారు లాంగ్ ఎక్స్పోజర్ షాట్స్ తీయడానికి ప్రయత్నించాలి. ఇది ప్లానెట్ పరేడ్కి సంబంధించిన స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది.
బైనాక్యులర్స్ వాడితే జూపిటర్, దాని చంద్రుడు కనిపిస్తాయని.. టెలిస్కోప్ సాయంతో యురేనస్, నెప్ట్యూన్ని చూడవచ్చని బెంగళూరు అస్ట్రోనమీ క్లబ్‌కి చెందిన విజయ్ కపూర్ తెలిపారు.
కాగా కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రహాల విజిబిలిటీ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ యాప్స్ ఉపయోగపడతాయి..
ప్లానెట్ పరేడ్‌ని వీక్షించేందుకు కొన్ని యాప్స్ ఉపయోగపడతాయి. అవి..
- స్టార్ వాక్
- స్టార్ ట్రాకర్
- స్కై మ్యాప్
2025లో ఇతర ఖగోళ సంఘటనలు..
ఖగోళ అద్భుతాలతో నిండిన సంవత్సరానికి మీరు సిద్ధమా? ప్లానెట్ పరేడ్ 2025తో పాటు ఈ ఏడాది ఇవి కూడా ఉన్నాయి..
1. సంపూర్ణ చంద్రగ్రహణం (మార్చి 13-14)
2. గురు-శుక్ర సంయోగం (ఆగస్టు 12)
3. సూపర్ హార్వెస్ట్ మూన్ (అక్టోబర్ 6)
4. జెమిటిన్ మీటియర్ షవర్ (డిసెంబర్ 13-14)
సంబంధిత కథనం