Pilots fall asleep : అటు పైలట్ల 'నిద్ర'- ఇటు 37వేల అడుగుల ఎత్తులో విమానం.. చివరికి!-pilots fall asleep while flying at 37 000 feet plane miss landing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pilots Fall Asleep While Flying At 37,000 Feet, Plane Miss Landing

Pilots fall asleep : అటు పైలట్ల 'నిద్ర'- ఇటు 37వేల అడుగుల ఎత్తులో విమానం.. చివరికి!

Sharath Chitturi HT Telugu
Aug 19, 2022 02:42 PM IST

Pilots fall asleep : ఆ విమానం 37వేల ఎత్తులో ప్రయాణిస్తోంది. సమీపంలోనే ఎయిర్​పోర్టు ఉంది. రన్​వేపై విమానం దిగాల్సి ఉంది. కానీ.. అలా జరగలేదు. రన్​వే దాటుకుని వెళ్లిపోయింది. ఏటీసీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పైలట్లను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించారు. కానీ పైలట్లు స్పందించలేదు. ఆ విమానంలో అసలేం జరిగింది? చివరికి విమానం పరిస్థితేంటి?

అటు పైలట్ల నిద్ర.. ఇటు 37వేల అడుగుల ఎత్తులో విమానం.. చివరికి!
అటు పైలట్ల నిద్ర.. ఇటు 37వేల అడుగుల ఎత్తులో విమానం.. చివరికి! (AP)

Pilots fall asleep : విమానాల్లో ఏ చిన్న తప్పు జరిగినా.. ప్రాణనష్టం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా విమాన ప్రయాణం సాఫీగా జరగాలంటే పైలట్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది.. ఓ విమానం.. 37వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు.. అందులోని ఇద్దరు పైలట్లు నిద్రపోయారు!

ట్రెండింగ్ వార్తలు

సోమవారం.. సుడాన్​లోని ఖార్టూమ్​ నుంచి ఇథియోపియా రాజధాని ఆడిస్​ అబాబాకు బయలుదేరింది ఇథయోపియన్​ ఎయిర్​లైన్స్ ఈటీ343​. కాగా.. అందులో ఇద్దరు పైలట్లు నిద్రపోయారు. ఆడిస్​ అబాబా విమనాశ్రయంలో ఆ విమానం దిగాల్సి ఉంది. రన్​వే సమీపిస్తున్నా, విమానం కిందకి దిగలేదు. దీంతో ఎయిర్​ ట్రఫిక్​ కంట్రోల్​(ఈఏసీ) సిబ్బంది ఆందోళన చెందారు. వెంటనే అలర్ట్​ చేసేందుకు ప్రయత్నించారు. పైలట్లను సంప్రదించేందుకు తీవ్రంగా కృషి చేశారు. కానీ పైలట్ల నుంచి ఎలాంటి స్పందన లభించలేదు.

అయితే.. పైలట్లు పడుకునే సమయంలో ఆటోపైలట్​ మోడ్​ను ఆన్​ చేసినట్టు తెలుస్తోంది. రన్​వేదాటిన తర్వాత.. అది ఆఫ్​ అయినట్టు, వెంటనే ఆలరం మోగినట్టు సమాచారం.

ఆ శబ్దానికి పైలట్లు నిద్ర నుంచి హఠాత్తుగా లేచి, ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు. చివరికి.. 25నిమిషాల గందరగోళం తర్వాత.. విమానం.. రన్​వైపై ల్యాండ్​ అయ్యింది. అప్పడు అసలు విషయం బయటపడింది.

ఆ విమానం.. మరో ట్రిప్​ వేసేందుకు 2.5గంటలు ఆలస్యమైంది.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు.

ఏడీఎస్​-బీ(ఏవియేషన్​ సర్వీలియన్స్​ సిస్టం) కూడా ఈ ఘటనను ధ్రువీకరించింది. విమానం.. రన్​వే దాటి వెళ్లిపోయిందని పేర్కొంది. ఇది చాలా ఆందోళనకర విషయం ఏవిషేయన్​ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

<p>విమానం రూట్​ ఇలా..</p>
విమానం రూట్​ ఇలా.. ( Alex Macheras/twitter)

ఇలా.. విమానంలో పైలట్లు నిద్రపోతున్న ఘటనలు కొత్తేమీ కాదు. మే నెలలో.. న్యూయార్క్​ నుంచి రోమ్​కు బయలుదేరిన ఓ విమానంలోనూ పైలట్లు పడుకుండిపోయారు. అప్పుడు ఆ విమానం 38వేల అడుగుల ఎత్తులో ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్